పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మానవ సమాజాలకు నాయకులు ఉండాలి, లేకపోతే అవి కొనసాగవు. తిరుసభ కూడ మానవసమాజం గనుక దానికి గూడ మానవనాయకులుండాలి. ఈ నాయకులే గురుత్వమనే దేవద్రవ్యానుమానాన్ని పొందిన గురువులు.

ఈ నాయకులకు తిరుసభను నడిపించే వరాన్ని దేవుని ఆత్మే దయచేస్తుంది. ఇది ప్రత్యేక వరం. ఈ వరం కలవాళ్ళ తిరుసభను దేవుని మార్గాల్లో నడిపిస్తారు. దానిలోని కార్యకలాపాలను క్రమబద్ధం చేస్తారు. దానిలోని ప్రజలు ఆత్మ తమకు దయచేసిన వరాలను సద్వినియోగం చేసికొనేలా చేస్తారు. గురుపట్టం ద్వారా గురువులు తిరుసభకు నాయకులౌతారు. ఈ గురుపట్టం అధికారయుతమైంది. ఐనా సేవాత్మకమైంది.
తిరుసభలోని అధికారానికి కొన్ని లక్షణాలున్నాయి. అది ఆత్మ ప్రేరితమైంది. దేవుని ఆత్మే కొందరు వ్యక్తులను ఎన్నుకొని వారిని గురుజీవితానికి ఆహ్వానిస్తుంది. వీళ్ళు తర్వాత ఆ సభలో అధికారం నాయకత్వం చేపడతారు. దేవుడు ఆహ్వానించందే ఎవరూ తమంతట తాము గురువులు కాలేరు. ఇంకా, ఈ పవిత్ర సమాజంలో నాయకత్వం శాశ్వతమైంది. గురువైన వ్యక్తి శాశ్వతంగా గురువుగానే వుంటాడు. గురుత్వం అతనిమిూద శాశ్వతమైన ముద్రను వేస్తుంది. అతడు క్రీస్తు స్థానంలో వుండి తిరుభలో పనిచేస్తాడు. పైపెచ్చు ఈ దివ్య సమాజంలో నాయకత్వం బహిరంగమైంది. గురువు గురుపట్టం ద్వారా అధికారాన్ని బహిరంగంగానే పొందుతాడు. తర్వాత ఆ యధికారాన్ని బహిరంగంగానే నిర్వహిస్తాడు.
తిరుసభలో అధికారులు లేక నాయకులు లేక గురువులు క్రీస్తు స్థానంలో వుండేవాళ్లు, క్రీస్తులాగే మంద కొరకు ప్రాణాలు అర్పించేవాళ్లు, గురువు తన కొరకు తాను కాక క్రీస్తు మంద కొరకు వున్నవాడు. గురువు ప్రధాన బాధ్యత దైవరాజ్యాన్ని గూర్చి ప్రజలకు బోధించి దాన్ని వ్యాప్తి చేయడం. ఆ రాజ్యానికి సాక్షిగా వుండడం. అతడు ఈ లోకంలో క్రీస్తు మధ్యవర్తిత్వాన్ని కొనసాగిస్తాడు. పూజబలి ద్వారా క్రీస్తుని విశ్వాసులకు ప్రత్యక్షం చేస్తాడు. ఈ గురుపదవిలో పీఠాధిపతి, గురువు, పరిచారకుడు (డీకన్) అని మూడు అంతస్తులున్నాయి. మన దేశంలోగాని, ల్యాటిన్ తిరుసభలోగాని జీవితాంతం డీకన్లుగా వుండేవాళ్లు ఎవరూ లేరు. గ్రీకు తిరుసభలో వున్నారు. ఇక, దైవశాస్త్ర రీత్యా గురుపదవి భావమేమిటో చూద్దాం.

2. అధికారం సేవ కొరకే

తిరుసభలో అధికారాన్ని లేక నాయకత్వాన్ని సేవ అంటారు. ఈ నాయకత్వానికి "నూతవేదం వాడిని గ్రీకుమాట "డియాకోనియా". ఈ మాటకు మొదట అన్నం వడ్డించడం