పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అని అర్థం, అన్నం వడ్డించడం అనే మూలార్థం నుంచి సేవచేయడం అనే భావం క్రమేణ వ్యాప్తిలోకి వచ్చింది. కనుక తిరుసభలో అధికారమంటే సేవ.

క్రీస్తు తిరుసభలోని నాయకులు సేవకులుగా వ్యవహరించాలని కోరాడు. వాళ్లు ప్రజలకు సేవలు చేయడానికే జీవించాలని ఆజ్ఞాపించాడు. ఈ సేవాభావం లోకంలోని నాయకుల్లో లేదు. వాళ్ల పెత్తనం చలాయిస్తారు - మార్కు 10,42-45. సేవకులంగా మెలగడం మనకు కష్టం. కనుక క్రీస్తే స్వయంగా శిష్యుల కాళ్ల కడిగి మనకు ఓ ఆదర్శాన్ని చూపించాడు. మామూలుగా శిష్యులు గురువు కాళ్లు కడగాలి. కాని గురువే శిష్యుల కాళ్లు కడిగి తాను సేవకుణ్ణని రుజువు చేసికొన్నాడు - యోహా 13,5. నేను మిమధ్య సేవకుణ్ణిగా వున్నానని చెప్పకొన్నాడు — లూకా 22,27.

కనుక తిరుసభలో నాయకులు అధికారులు ఐన గురువులు ఏనాడూ యజమానులుగాను పెత్తనం చలాయించే వాళ్లుగాను మెలగకూడదు. అది లోకంలో, రాజకీయాల్లో చెల్లుతుందిగాని క్రీస్తు సమాజంలో చెల్లదు. గురుత్వం పదవి, గౌరవం, పలుకుబడి, పెత్తనం, స్వార్ధలాభం మొదలైనవాటికొరకు ఉద్దేశింపబడింది కాదు. భక్తితో వినయంతో క్రీస్తు మందకు సేవలు చేయడం కొరకు ఉద్దేశింపబడింది.

గురువు గురుపట్టాభిషేక సాంగ్యంలో బిషప్ప "క్రీస్తు సేవలు చేయడానికేగాని జేయించుకోవడానికి రాలేదు. అతడు తప్పిపోయిన గొర్రెలను వెదకి రక్షించడానికి వచ్చాడు. నీవు ఎల్లప్పడు ఆ మంచి కాపరిని ఆదర్శంగా పెట్టుకో? అని నూత్న గురువును హెచ్చరిస్తారు. “దేవుని దాసులకు దాసుడు” అని పోపుగారికి బిరుదం. తిరుసభలోని అధికారులు దేవుడు తమకు ఒప్పగించిన మందమిూద పెత్తనం చలాయించకూడదని చెప్మంది మొదటి పేత్రు జాబు 5,1-3.

తిరుసభలోని అధికారులనూ ప్రజలనూ గూర్చి చెప్పేపుడు నూత్నవేదం వాడే ఉపమానాలు కాపరి-మంద, భర్త-భార్య అనేవి. మంచి కాపరి తన మందకొరకు ప్రాణాలు అర్పిస్తాడు - యోహా 10,11. క్రీస్తు తిరుసభ అనే వధువు పాపమాలిన్యాన్ని తొలగించడానికి సిలువమిూద ప్రాణాలు అర్పించాడు - ఎఫె 5,25-27, గురువులు తిరుసభలో క్రీస్తుస్థానంలో వుండేవాళ్లు. కనుక వాళ్లు క్రీస్తులాగే మందకు సేవలు చేయాలి. ఆ మందకొరకు తమ ప్రాణాలను గూడ అర్పించాలి. ఇదే మొదట మనం పేర్కొన్న డియాకోనియా లేక సేవ అన్న మాటకు అర్థం. కనుక మందను తన స్వార్గానికి వాడుకొనేవాడు దుష్ట గురువు, అతడు గురువు పదవికి అర్హుడు కాడు.

3. గురుత్వంలో మూడంతస్తులు

ఇక గురుపదవి చరిత్రను పరిశీలిద్దాం. గురుత్వంలో పీఠాధిపతి, గురువు, పరిచారకుడు అని మూడంతస్తులున్నాయి. క్రీస్తు మొదట గురుత్వాన్ని స్థాపించినపుడు