పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సైఫను హింసతో యెరూషలేములోని క్రైస్తవ యూదులు చెల్లాచెదరై యితర ప్రాంతాలకు పారిపోయి అక్కడ అన్యజాతులకు గూడ క్రీస్తుని బోధించారు. విశేషంగా అంతియోకయ కేంద్రంలో చాలమంది గ్రీకు ప్రజల క్రైస్తవ సమాజంలో చేరారు - 1.చ. 11,20-21. దీనితో తొలినాటి క్రెస్తవ బృందానికి నూత్నజ్ఞానం కలిగింది. క్రొత్త యిస్రాయేలులో యూదులు మాత్రమే కాక అన్యజాతుల వాళ్ళకూడ వుంటారని అర్థమైంది. పూర్వవేద ప్రజలు యూదులు మాత్రమే. కాని నూత్న యిస్రాయేలు అన్ని జాతులతో కూడింది.

2. పూర్వవేద ప్రజ పోయి నూతవేద ప్రజ వచ్చింది అని చెప్పాం. ఈ నూతవేద ప్రజ పూర్వవేద ప్రజల పవిత్ర లక్షణాలను తనకూ అన్వయించుకొంది. 1పేత్రు 2,9- 10లో ఈ యన్వయం స్పష్టంగా కన్పిస్తుంది. "విూరు ఎన్నుకొనబడిన జాతి. రాచరికపు గురుకులము. పవిత్ర జనము. దేవుని సొంత ప్రజలు.”

సీనాయి నిబంధనలో యిస్రాయేలు ప్రజలకు వర్తించిన లక్షణాలే (నిర్ణ 19,5- 6). ఇక్కడ క్రెస్తవ ప్రజలకు కూడ వర్తిస్తాయని ఈ వాక్యాల భావం. ఈ పట్టున మనం నాలు లక్షణాలను పరిశీలిద్దాం.

1. క్రైస్తవులు "దేవుడు ఎన్నుకొనిన జాతి", ఇది పూర్వవేద యూదుల లక్షణం - నిర్గ 19,5. ఇప్పడు అదే లక్షణం క్రైస్తవులకూ వర్తిస్తుంది. 

2. వారు "రాచరికపు గురుకులం.” ఇది నిర్గమ కాండంలోని యాజక రూపమైన రాజ్యం అనేదానికి సమానం 19,6. పూర్వవేదప యూదుల దేవుణ్ణి పూజించే శ్రేష్టమైన యాజకులు, అలాగే క్రైస్తవులు కూడ క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొంది ఆ ప్రభువుని పూజించే శ్రేషులైన యాజకులౌతారు.

3. వారు "పవిత్రప్రజ". పూర్వవేద జనులు పవిత్ర ప్రజలు 19,6. వాళ్ళ పవిత్రుడైన దేవునికి అంకితులై అతన్ని కొల్చారు. కనుక పవిత్రప్రజలయ్యారు, సీనాయి నిబంధనం వాళ్ళను ఇతర జాతులనుండి వేరుచేసి ప్రభువుకి అంకితం చేసింది. దీనివల్ల వాళ్లు పవిత్ర ప్రజలయ్యారు. నూత్నవేదంలో మనం జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు ప్రజలమై అతనికి అంకితమౌతాం. కనుక పవిత్ర ప్రజలమౌతాం. 

4 క్రైస్తవులు “దేవుని సొంత ప్రజలు." పూర్వవేద కాలంలో ఎన్నో జాతులు వుంటే దేవుడు యిస్రాయేలునే తన సొంత ప్రజగా ఎన్నుకొన్నాడు - 19,6. అలాగే నూత్నవేదంలో పలు జాతుల మధ్య మనం క్రీస్తుకి సొంత ప్రజలమౌతాం. మన జ్ఞానస్నానమే దీనికి కారణం.

ఈ యాలోకనాన్ని బట్టి తొలినాటి క్రైస్తవులు తామే అంత్యకాలపు దైవప్రజలమని అర్థం జేసికొన్నారు అనుకోవాలి. అంత్యకాలపు ప్రజలను గూర్చిన ప్రవచనాలు తమ విషయంలో నెరవేరాయని ఎంచారు అనుకోవాలి, 127