పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. పూర్వ నూత్నవేదాల ప్రజలకు తేడా ప్రధానంగా ఒక్క అంశంలోనే వుంది. అది వుత్థాన క్రీస్తు ఆరాధనం. దేవుడు ఈ యంత్యకాలపు ప్రజను క్రీస్తు చిందించిన రక్తం ద్వారా సంపాదించుకొన్నాడు — అ.చ. 20,28. క్రీస్తు అనేకులకొరకు తన రకాన్ని చిందించాడు - మార్కు 14,24. ఈ యనేకులు యూదులూ అన్యజాతివాళ్లు కూడాను. వీళ్ళంతా క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొంది అతనిద్వారా తండ్రిని ఆరాధించే నూత్నప్రజ ఔతారు. కనుక క్రీస్తుద్వారా నూత్వవేద ప్రజ పూర్వవేద ప్రజకంటె భిన్నమైనదౌతుంది.

4. రెండవ వాటికన్ మహాసభ నూత్నవేద ప్రజల లక్షణాలను నాల్గిడింటిని పేర్కొంటుంది.

మొదటిది, నూత్నవేద ప్రజలంతా ఏకప్రజ. అనగా పోపుగారు బిషప్పలు గురువులు మఠవాసులు గృహస్తులూ అందరూ దైవప్రజలే. ఈ దృష్టితో జూస్తే వీళ్లల్లో తారతమ్యాలు లేవు. అంతా దైవప్రజ. అందరి విలువా సరిసమానమే. అందరూ దేవునికి అంకితమైన ఏకప్రజే.

రెండవది, ఈ ప్రజ నూతప్రజ. పూర్వవేదపు యూదులకు మారుగా వచ్చిన క్రొత్తప్రజ. క్రీస్తు సిలువబలి వీళ్ల ఆవిర్భావానికి కారణం. పూర్వ నూత్నవేద కాలాల్లో గూడ దేవుడు తలంచుకొంటే వ్యక్తులను వ్యక్తులనుగా రక్షించేవాడే. కాని అతడు పూర్వ నూత్నవేద ప్రజలనుగూడ సమాజాలనులాగే రక్షించాడు. ఇప్పుడు మనం క్రైస్తవ వ్యక్తులంగాము, క్రెస్తవ సమాజానిమి.

మూడవది, నూత్నవేద ప్రజలకు వ్యత్యాసం క్రీస్తు వల్లనే వచ్చింది. వాళ్ళు క్రీస్తు ఆత్మార్పణం వలన ఆవిర్భవించినవాళ్ళు. పూర్వవేద ప్రజలు దేవుని దాసులు. వీళ్ళు క్రీస్తుద్వారా దేవునికి దత్తపుత్రులు. మెస్సీయా ప్రజలు. వీళ్ల ద్వారా ఇప్పడు లోకంలోని జాతులన్నీ దీవెనలు పొందుతాయి.

నాల్గవది, నూత్నవేద ప్రజ యాత్రికప్రజ. పూర్వం యూదులు ఈజిప్టునుండి వాగ్ధత్త భూమికి యాత్ర చేసారు. ఇప్పడు మనం ఈ లోకంనుండి పరలోకానికి యాత్రచేస్తున్నాం. ఈ లోకంలో తిరుసభ పాప భూయిష్టంగా వుంటుంది. కనుక అది మాటిమాటికీ పశ్చాత్తాపపడి తన పాపమాలిన్యాన్ని కడిగివేసుకొంటూండాలి. తన తప్పిదాలకు నిరంతరమూ దేవునినుండి మన్నింపు పొందుతూండాలి. ఈ పశ్చాత్తాపం ద్వారా తన వినయాన్ని ప్రకటించుకొంటూండాలి.

5. ఇప్పడు ఎవరు, ఏ విధంగా తిరుసభకు చెందుతారు? ఇప్పడు క్యాతలిక్ క్రెస్తవులూ వున్నారు. ప్రోటస్టెంటు క్రెస్తవులూ వున్నారు. అన్యమతాలకు చెందిన క్రైస్తవేతరులూ వున్నారు. వీళ్ళంతా ఏవిధంగా తిరుసభకు చెందుతారు? ఈ మూడువర్గాల 128