పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10,21-22. వీళ్లు "నూత్న యిస్రాయేలు" ఔతారు. ప్రవక్తల బోధల ప్రకారం ప్రభువు అంత్యకాలంలో యూదప్రజల హృదయాన్ని మారుస్తాడు. వాళ్ళతో నూత్న నిబంధనం చేసికొంటాడు - యిర్మీ 31, 31. అప్పడు మళ్లా యూదులు ప్రభువు ప్రజలౌతారు, అతడు వాళ్లు కొలిచే దేవుడౌతాడు. పూర్వవేదాంత కాలంలో భక్తులు ఈ నూత్న నిబంధన కొరకు ఎదురుచూస్తున్నారు. ఆ నిరీక్షణం క్రీస్తు ద్వారా ఫలిస్తుంది.

పైన మనం పేర్కొన్న ఐదంశాల సారాంశం ఇది.
1. దేవుడు కేవలం తన ప్రేమవల్లనే యిప్రాయేలును ఎన్నుకొన్నాడు.
2. దేవుడు వారిని ఎన్నుకొంది తన్నుపూజించే పవిత్ర ప్రజను తయారుచేయడానికే. యూదులు ప్రధానంగా యావేను పూజించే యాజకులు.
3. నిబంధనం ద్వారా యూదులు యావే ప్రజలయ్యారు. యిశ్రాయేలు ప్రభువును నిరాకరించినా అతడు వాళ్ళను నిరాకరించడు. అతడు అంత్యకాలంలో నూత్న నిబంధనం ద్వారా మళ్లి నూత్న ప్రజను తయారుచేస్తాడు.

2. నూత్న వేదంలో దైవప్రజ

ప్రవక్తలు అంత్యకాలంలో నూత్న నిబంధనం జరుగుతుందనీ నూత్నప్రజ పుడుతుందనీ తెలియజేసారు. పూర్వవేదం సూచించిన ఈ యంత్యకాలప్రజ క్రైస్తవ ప్రజలేనని చెప్తుంది నూత్నవేదం. పూర్వవేదం యూద ప్రజకు చెప్పిన లక్షణాలన్నీ నూత్నవేదం క్రైస్తవ ప్రజలకు గూడ వర్తింపజేస్తుంది. ఇక, పూర్వవేద ప్రజలుపోయి నూత్నవేద ప్రజలు ఏలా వచ్చారో పరిశీలిద్దాం. ఇక్కడ ఐదంశాలు చూద్దాం.

1. చారిత్రకంగా జరిగిన సంగతి యిది. పూర్వవేదప్రజ పోయి నూత్నవేద ప్రజ వచ్చిందని తొలినాటి యెరూషలేము క్రైస్తవులు క్రమేణ గుర్తించారు. వాళ్లు క్రమేణ తాము కొత్త యిస్రాయేలుమని అర్థం జేసికొన్నారు.

తొలుత యూదులు యూదక్రైస్తవులు కలసే వుండేవాళ్ళు యూద క్రైస్తవులు కూడ ధర్మశాస్త్రాతాన్ని పాటించారు, దేవాలయారాధనలో పాల్గొన్నారు. కాని వాళ్ళకు ఉత్తాన క్రీస్తుపట్ల విశ్వాసం వుంది. ఆ విశ్వాసమే వాళ్ళు తాము నిజమైన యిస్రాయేలుమని గుర్తించేలా చేసింది.

ఈ క్రైస్తవ సమాజం జ్ఞానస్నానాన్నిస్వీకరించి తమ యిండ్లల్లోనే ప్రార్ధన జరిపి దివ్యసత్ప్రసాద బలిని సమర్పించింది. పేత్రు నాయకత్వం క్రింద ఉమ్మడి జీవితం గడిపి క్రీస్తు నేర్పిన ప్రేమ సూత్రాన్ని పాటించింది. ఈ కార్యాలేవీ యూద సమాజంలో లేవు. వీటివల్లగూడ తొలినాటి, క్రైస్తవులు తాము వేరే సమాజమని గుర్తించారు. పూర్వవేదం పేర్కొన్న అంత్యకాలపు దైవప్రజ తామేనని గ్రహించారు. 126