పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువు యిప్రాయేలు సమాజంలో వసిస్తాడు - నిర్ణ 29,45-46. వాళ్ళను కాచి కాపాడతాడు. ఈ దైవసాన్నిధ్యాన్నే యూదులు ఇమ్మానువేలు అని పిల్చారు. ఆ ప్రజలు దైవ మందసం చుటూ ప్రోగై ఈ యిమ్మానువేలు దేవుణ్ణి ఆరాధించారు. ఈ యారాధనలో వాళ్లు ఆ ప్రభువు తమ్ముఐగుప్త దాస్యంనుండి విడిపించుకొని వచ్చి సీనాయి కొండదగ్గర తమతో నిబంధనం చేసికొన్న వదంతాన్ని జ్ఞప్తికి తెచ్చుకొన్నారు.

2. ప్రభువు యిప్రాయేలీయులను ఎన్నుకొంది వాళ్ల తన్నుస్తుతించి కీర్తించడానికి, అన్యప్రజలకుగూడ ఆ దేవుణ్ణి తెలియజేసి వాళ్ళనుగూడ ఆ ప్రభువు దగ్గరికి రాబట్టడానికి -యెష43,21. లోకంలోని జాతుల్లోయిస్రాయేలు ముఖ్యమైంది. దీనిద్వారా అన్యజాతులు యావే దగ్గరికి రావాలి. ప్రభువు మొదట యిస్రాయేలును రక్షిస్తాడు. దానిద్వారా అన్యజాతులను గూడ రక్షిస్తాడు. యెహెజ్కేలు ప్రవక్త చూచిన జలప్రవాహం దేవాలయం నుండి అన్ని దిశలకు పారుతుంది. అనగా ప్రభువు రక్షణం యూదులనుండి అన్నిజాతులకూ వ్యాపిస్తుందని భావం - 47.1-12. యూదులకు జాతిపితయైన అబ్రాహాము దీవెనలు అన్ని జాతులకూ లభిస్తాయి - ఆది 12.2-3. కనుక యిస్రాయేలు అన్యజాతులకు మధ్యవర్తి, దీపం, నిబంధనం ఔతుంది - యెష42,6. ఈ విధంగా యూదులు దేవుణ్ణి పూజించి అన్యులు కూడ అతన్ని పూజించేలా చేస్తారు. ఇందుకే దేవుడు వాళ్లను ఎన్నుకొంది.
3. దైవప్రజలకు గుర్తు ఏమిటి? మొదట వీళ్లు అబ్రాహాము ఈసాకు యాకోబులనే పితరుల వంశానికి చెందివుండాలి. అటుతర్వాత అబ్రాహాము కాలంనుండి ఆచరణలో వున్న సున్నతిని పొందివుండాలి. ఇంకా, ప్రభువు ధర్మశాస్తాన్ని పాటించాలి. విశేషంగా దానిలో పవిత్రతకు సంబంధించిన నియమాలనూ, అతిముఖ్యంగా విశ్రాంతిదిననియమాన్నీ పాటించాలి. ఈ బాహ్య లక్షణాలతో పాటు యావే ప్రభువుని ఏకైక హృదయంతో సేవించాలి. ఇది ఆంతరంగికమైన లక్షణం - నిర్గ20,1-3. ఈలాంటి వాళ్ళకు అబ్రాహాము దీవెనలు లభిస్తాయి. 

4. యిస్రాయేలీయులకు వ్యక్తీ ముఖ్యమే సమాజమూ ముఖ్యమే. సమాజం పాపపుణ్యాలు వ్యక్తినీ, వ్యక్తి పాపపుణ్యాలు సమాజాన్నీ ప్రభావితం చేస్తాయి. కనుక వాళ్ళంతా పరస్పర సంబంధం కలవాళ్లు, కావున ఏకంగా యిప్రాయేలు సమాజమూ ముఖ్యమే, వ్యస్తంగా ఆ సమాజంలోని ప్రతివ్యక్తీ ముఖ్యమే.

5. యూదులు దేవుడు చేసిన నిబంధనను మిూరారు. యావేను నిరాకరించారు. ప్రభువు వాళ్ళను రోసి మిూరు నా ప్రజలు కాదు నేను విూ దేవుణ్ణి కాదు అని పల్కాడు - హోషే 19. సీనాయి నిబంధనను రద్దుచేసాడు. కాని యూదులంతా యావేను నిరాకరించరు. "శేషజనం" అనే చిన్న వర్గం అతన్ని భక్తితో కొలుస్తుంటుంది - యెష