పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈలా మనం ఒప్పకొన్న శిక్షను క్రీస్తు శిక్షతో చేర్చి అనుభవిస్తాం, గురువువిధించే అపరాధాన్ని తీర్చడమంటే యిదే. ఈ ప్రక్రియ ద్వారా క్రీస్తుపాటులూ మరణమూ మనమిూద సోకి మనకు వరప్రసాదాన్ని ఆర్జించిపెడతాయి. "మా శరీరంలో క్రీస్తు మరణం ప్రత్యక్షమౌతుంది" అన్నాడు పౌలు - 2కొ 4,11. కనుక జ్ఞానస్నానం పొందిన క్రైస్తవులు అనుభవించే బాధలన్నీ క్రీస్తు మరణాన్నీ తమలో ప్రత్యక్షం చేసికోవడమే ఔతుంది.

ఇంకా పౌలు "క్రీస్తు తన శరీరమైన శ్రీసభకొరకు పడిన బాధలలో కొదవగా వున్నవానిని నేను నా శ్రమలద్వారా తీరుస్తున్నాను" అన్నాడు - కొలో 1,24. క్రీస్తు శ్రమలు స్వయంగా మన పాపాలను మన్నించగలవు. అయినా అతడు కరుణాళువ గనుక మనశ్రమలనుగూడ తనశ్రమలతో కలుపుకొనే మనలను రక్షిస్తాడు. కనుక మనప్రాయశ్చిత్తం క్రీస్తు శ్రమలతో కలుస్తుంది. ఇంకా, మన ప్రాయశ్చిత్తం మన వ్యక్తిగతమైంది మాత్రమే కాదు. అది శ్రీసభ కంతటికీ ఉపకరిస్తుంది. శ్రీసభ మాలిన్యాన్ని తొలగించి ఆతల్లిని అధిక పవిత్రురాలిని చేస్తుంది.

తొలి శతాబ్దాల్లో పాపాలకు పెద్ద ప్రాయశ్చిత్తం విధించేవాళ్ళు ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలు, స్వీయదేహాన్ని దెబ్బలతో హింసించుకోవడం మొదలైనవి ఈ యపరాధాలు. ఈశిక్షలను విశ్వాసులు వారాలూ నెలలూ సంవత్సరాలూ కూడ పాటింపవలసి వుండేది. కాని ఇప్పటికాలంలో ప్రాయశ్చిత్త శిక్షను పూర్తిగా తగ్గించారు. ఇప్పడు రెండుమూడు జపాలుచెప్పి అపరాధాన్ని ఒక్కనిమిషంలో ముగిస్తాం అంతే. కాని భక్తుడైన క్రైస్తవుడు గురువు విధించే చిన్న అపరాధాన్ని తీర్చడంతోనే సంతృప్తి చెందకూడదు. తన పాపాలకు తానే స్వయంగాగూడ ఏదైనదండనం విధించుకొని దాన్ని తీర్చాలి. ఉదాహరణకు మన జీవితంలో సంభవించే వ్యాధిబాధలూ కష్టాలూ ఇబ్బందులూ మొదలైనవాటినన్నిటినీ ప్రాయశ్చిత్తంగా స్వీకరించి మంచి మనస్సుతో సహించవచ్చు. ఈలా మనం బుద్ధిపూర్వకంగా అనుభవించే కష్టాలుకూడ క్రీస్తు శ్రమలతో ఐక్యమై మనకు వరప్రసాదాన్ని ఆర్ధించిపెడతాయి. మన అనిత్యశిక్షను తగ్గిస్తాయి.

పాపోచ్చారణంలో గురువు మన పాపాలకు మన్నింపు దయచేసేపుడు ఈ క్రింది జపం చెప్తారు. "నీవు చేసే మంచి పనులూ నీవనుభవించే శ్రమలుకూడ క్రీస్తు అనుభవించిన శ్రమల భాగ్యంవల్లా, మరియమాతా పునీతులూ ఆర్థించిన పుణ్యాల ఫలితంవల్లా నీకు పాపపరిహారాన్నీ వరప్రసాదాభివృద్ధినీ, మోక్షభాగ్యాన్నీ సంపాదించి పెట్టుగాక." కనుక మన సత్కార్యాలూ మన శ్రమలూకూడ క్రీస్తు శ్రమలతోను పునీతుల పుణ్యాలతోను ఏకమై మనకు వరప్రసాదాన్ని ఆర్థించి పెడతాయి. అందుకేమనం జీవితంలోనిఇబ్బందులన్నిటినీ ప్రాయశ్చిత్తంగా అంగీకరించాలి. పాపోచ్చారణం అనే సంస్కారాన్ని కేవలం గుళ్ళనే