పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సృష్టివస్తువులవైపు పోనిస్తూంటాం. ఫలితంగా అది ఓ క్షణాన పూర్తిగా సృష్టివస్తువులకు అంటిపెట్టుకొంటుంది. సృష్టికర్తను పూర్తిగా నిరాకరిస్తుంది. అనగా చావైన పాపానికి ముందుగా చాలా స్వల్పపాపాలు కట్టుకొని వుంటాం. అలాగే చావైన పాపానికి పశ్చాత్తాపపడ్డమనేదిగూడ దిథీలున ఒక్కక్షణంలో జరుగదు. నరుడు నిదానంగా, అడుగుతర్వాత అడుగు వేసికొంటూగాని సృష్టి వస్తువులనుండి సృష్టికర్తవద్దకు తిరిగాడు.

సామాన్యంగా చావైనపాపం చేయడం అంత సులభం కాదు. విశేషంగా భక్తితో జీవించేవాళ్లు అరుదుగా గాని చావైన పాపం కట్టుకోరు. పాపావకాశం తటస్థించినపుడు కూడ వరప్రసాద బలం వాళ్ళను ఆదుకొంటుంది. కనుక మామూలుగా చావైన పాపాలు మన మనుకొన్న దానికంటె తక్కువగానే వుంటాయి.

ఇక, స్వల్పపాపం చిన్నదైనా గూడ అదీ పాపమే. దేవుడు దాన్ని గూడ అసహ్యించుకొంటాడు. కనుక మనం సులువుగా ఈ పాపానికి లొంగకూడదు. దీనివల్ల మనలోని దైవప్రేమా వరప్రసాదమూ సన్నగిల్లిపోతాయి. చాల నీటి బొట్ల పెద్ద వెల్లవగా తయారైనట్లు చాల స్వల్పపాపాలు చావైన పాపానికి దారితీస్తాయి. మాటిమాటికీ సులువుగా స్వల్పపాపాల్లో పడిపోయే క్రైస్తవుని చిత్తశుద్ధిని శంకింపవలసి వుంటుంది.

నేడు నైతికశాస్త్రవేత్తలు పైనచెప్పిన చావైన పాపమూ స్వల్పపాపమూ మాత్రమేగాక "చావును ತಬ್ಬಿಪಿಟ್ಟಿದಿ” అనే మూడవ రకం పాపం గూడ వుంటుందని చెప్తున్నారు. ఈ పాపాన్ని నరుడు చనిపోయే సమయంలో చేస్తాడు. చనిపోయే గడియలో కొందరు నరులు దేవుణ్ణి బుద్ధిపూర్వకంగా నిరాకరిస్తాడు. ఇక పశ్చాత్తాపపడరు, మనసు మార్చుకోరు. ఈ నిర్ణయంవల్ల వాళ్లు ఆధ్యాత్మికమైన చావును తెచ్చిపెట్టుకొంటారు. ఇక వాళ్ళకు మోక్షప్రాప్తి గాని దైవదర్శనంగాని వుండవు. అయినా ఈ మూడవరకం పాపాన్ని గూర్చి వేదశాస్తుల్లో ఏకాభిప్రాయం గోచరించదు.

ప్రార్థనా భావాలు

1. పాపమంటే దేవుని ఆజ్ఞలను విూరడమా లేక ఆ దేవుని ప్రేమను నిరాకరించడమా? కొంతమంది దేవుని కట్టడలను మిూరడమే పాపమనుకొంటారు. ఈ భావం కలవాళ్లు దేవుణ్ణి అట్టే స్మరించుకోరు. దేవుని ఆజ్ఞలను మాత్రం స్మరించుకొంటారు. పూర్వవేదపు యూదులు ఈలాగే చేసారు. కాని ఇది ఉత్తమపద్ధతి కాదు. పాపమంటే ప్రధానంగా దేవుని ప్రేమను ధిక్కరించడం, ఓ తండ్రిలాంటివాడైన ఆ ప్రభువుని ద్వేషించడం. కనుక మనం పాపాన్ని గూర్చి తలంచేపుడు దేవుని కట్టడలను మిరాము అనుకోవడం కంటె అతని ప్రేమను త్రోసిపుచ్చాము అనుకోవడం