పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/177

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పొందాలి. అందుకే మన పాపోచ్చారణం వ్యక్తిగతమైంది కాదు, శ్రీసభ ద్వారా జరిగేది. కనుక మన పాపంలో సామూహిక గుణం కూడ వుందని గుర్తించాలి. అనగా మన పాపం వ్యక్తిగతంగా మనలను బాధించేది మాత్రమేకాదు మన నాటి సమాజాన్ని గూడ బాధించేదని గమనిస్తే చాలు.

4. చావైనపాపమూ స్వల్పపాపమూ

అన్నిపాపాలు ఫరోరమైనవి కావు. విశ్వాసులకు పాపాల్లో వుండే తారతమ్యం కొంతవరకైనా తెలిసివుండాలి. మనపాపాలు చావైనవి స్వల్పమైనవి అని రెండు రకాలుగా వుంటాయి. చావైనపాపంలో మూడంశాలుండాలి. మొదటిది, మనం చేసిన కార్యం ఘనమైనదిగా వుండాలి. రెండవది, మనం చేసేది పాపకార్యమని మనకుబాగా తెలిసివుండాలి, మూడవది, ఒకరి నిర్బంధం వలనగాక మనంతట మనమే స్వేచ్చగా ఆ పని చేసి వుండాలి.

చావైన పాపం చేసినపుడు సృష్టికర్తనుండి వైదొలుతాం. సృష్టివస్తువులవైపు మనసు త్రిప్పకొంటాం. స్వల్పపాపం చేసినపుడు సృష్టివస్తువులవైపు మనసు త్రిప్పకొంటాం గాని సృష్టికర్త నుండి మాత్రం పూర్తిగా వైదొలగం. కనుక స్వల్పపాపంలో దేవుడూ సృష్టివస్తువులూ రెండూ కావాలని కోరుకొంటాం,

బైబులు పాపాన్ని పేర్కొంటుందిగాని చావైన పాపానికీ స్వల్పపాపానికీవుండే వ్యత్యాసాన్ని ఎక్కడా వివరించదు. ఐనా కొన్నిపాపాలు మనలను దైవరాజ్యంనుండి వైదొలగిస్తాయని చెప్తుంది-1కొరి 6,9-10. మత్త 25,41-46. ఇవే చావైన పాపాలు, యాకోబు జాబు మనమందరమూ చాల తప్పలు చేస్తామని చెప్తుంది–3,2. ఇవే స్వల్పపాపాలు.

చావైన పాపంలో దేవుణ్ణి నిరాకరిస్తాం. అతని ఆజ్ఞ విూరతాం. అతన్ని ప్రేమించం. కనుక ఈ పాపం చాలా ఘటోరమైంది. స్వల్పపాపంలో ఐతే దేవుని ఆజ్ఞలను విూరినా అతన్ని ప్రేమిసూనే వుంటాం. సంసార జీవితంలో భార్య భర్తనుండి పూర్తిగా విడిపోవడంలాంటిది చావైన పాపం. ఈ పాపంలో మనకు దేవునితోవుండే సంబంధం తెగిపోతుంది. సంసార జీవితంలో భార్యాభర్తలు తగవులాడి ఎడమొగం పెడమొగంగా వుండడంలాంటిది స్వల్పపాపం. ఈ పాపంలో మనకు దేవునితో వుండే సంబంధం తెగిపోదు.

చావైన పాపమనేది దేవునితో పూర్తిగా తెగతెంపులు చేసికోవడమని చెప్పాం. మనం అకస్మాత్తుగా ఒక్కక్షణంలో చావైన పాపం చేయం, చాలాకాలం హృదయాన్ని