పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రార్థనాభావాలు

1.పూర్వవేద సంఘటనన్నిటిలోను ఐగుప్త నిర్గమనమూ సముద్రోత్తరణమూ నూతవేద జ్ఞానస్నానానికి ఎక్కువ చేరువగా వుంటాయని చెప్పాం. ఫరోకు పిశాచానికి పోలికలు చెపూ టెరూలియను ఈలా వ్రాసాడు. “యిస్రాయేలు ప్రజలు ఫరోదాస్యాన్నుండి తప్పించుకొనివచ్చి సముద్రం దాటారు. ఫరో అతని సైన్యమూ ఆ సముద్రజలాల్లో మునిగి చచ్చారు. ఈ సంఘటనం జ్ఞానస్నానాన్ని సూచిస్తుంది. నూత్నవేద ప్రజలు ఈ లోకమనే ఐగుపునుండి వెడలివచ్చి జ్ఞానస్నాన జలాలగుండా ఆవలికి దాటిపోతారు. ఇంతవరకూ వాళ్ళమీద అధికారం నెరపిన పిశాచం ఇప్పడు ఈ నీళ్ళలో మునిగి చస్తుంది".

ఇంకా ఈ సందర్భంలో బాసిలు భక్తుని వాక్యాలివి. “యిస్రాయేలీయులు సముద్రజలాన్ని దాటకపోతే ఫరోనుండి తప్పించుకొనేవాళ్ళు కాదు, అలాగే మీరుకూడ జలంగుండా నడవకపోతే పిశాచం క్రూరదాస్యంనుండి తప్పించుకోలేరు".

2.ఈ పట్టున ఆంబ్రోసు భక్తుడు ఈలావాకొన్నాడు. “యిస్రాయేలీయులకు సముద్రజలాన్ని దాటడం మహాకార్యం. కాని వాళ్ళలో సముద్రాన్ని దాటిన వాళ్ళకూడ తర్వాత ఎడారిలో చనిపోయారు. కాని యిపుడీ నీటిబుగ్గగుండా నడచిపోయేవాళ్న పాపంనుండి జీవానికి, భూలోకంనుండి పరలోకానికీ సాగిపోతారు. వాళ్ళ ఇక చనిపోక జీవానికి ఉత్థానమౌతారు".

3.ఆనాడు ఒక కాంతిమేఘం యిస్రాయేలీయులను సముద్రంగుండా, ఎడారిగుండా నడపించింది. నేడు మన స్నానంలో గూడ ఈ వెలుగు వుంటుంది. ప్రాచీనక్రైస్తవులు జ్ఞానస్నానానికి వాడిన పేర్లలో "వెలుగు" అనేదికూడ ఒకటి. ఈ సందర్భంలో ఆంబ్రోసు భక్తుని పల్మలివి. "యిస్రాయేలీయులను ఒక జ్యోతిరేఘం నడిపించిందని వింటున్నాం. ఈ కాంతిమేఘం క్రీస్తే, అతడు మన అజ్ఞానాన్ని తొలగించి మన హృదయాల్లో సత్యజ్యోతిని వెలిగించాడు."

4.యిస్రాయేలీయుల సముద్రోత్తరణానికీ మన జ్ఞానస్నానానికీ చాల పోలికలున్నాయని చెప్పాం. ఈ పోలికలను సిరిల్ భక్తుడు ఈలా వివరించాడు. “అక్కడ ప్రభువమోషేను ఐగుపులోకి పంపాడు. ఇక్కడక్రీస్తుని లోకంలోకి పంపాడు. ఆ ప్రజను ఐగుప్త దాస్యం నుండి విడిపించాలి. ఈ ప్రజను పాపదాస్యం నుండి విడిపించాలి. అక్కడ గొర్రెపిల్ల నెత్తురు వినాశక శక్తిని ఆవలకు పంపించింది.