పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోరాడే యోధునితో పోల్చాడు. ఈ పోరాటంలో మనం ధరించే ఆయుధాలు విశ్వాసమూ భక్తి మొదలైనవి - ఎఫె 6, 14-18. ఈ జీవితంలో నిత్యమూ పిశాచ శోధనలకు గురౌతుంటామనేది మనందరి అనుభవమే. ఈ పోరాటంలో జ్ఞానస్నాన బలం మనకు సాయపడుతుంది. క్రీస్తు శక్తి మన మీద పనిచేసి మనకు విజయాన్ని చేకూర్చిపెడుతుంది. దుర్భలమైన నేతిబీరతీగ బలమైన వేపచెట్టమీదికి అల్లుకొని ఆ చెట్టబలంలో పాలుపంచుకొంటుంది. అలాగే మనం ఈ సంస్కారం ద్వారా క్రీస్తులోనికి ఐక్యమై అతని నుండి బలాన్ని పొందుతాం. ఆ బలంతోనే దుష్టుడైన పిశాచంతో పోరాడతాం.

10. క్రీస్తు విజయంలో పాలుపొందుతాం.

జ్ఞానస్నానం ద్వారా మనం క్రీస్తు విజయంలో పాలుపొందుతాం. ఈ విజయం ఈ లోకంలోనే ప్రారంభమై మోక్షంలో ముగుస్తుంది. జ్ఞానస్నానంవల్ల మనం మోక్షానికి అర్బులమౌతాం. ఆవాగ్లత్త భూమి మనదౌతుంది. ఆ ప్రభువు విజయం మనకు సంక్రమిస్తుంది.

జ్ఞానస్నాన సాంగ్యంలో చిట్టచివర గురువు అభ్యర్థి తెల్లని కండువానిస్తారు. బైబుల్లో తెల్లని బట్ట దేవునికి అతని పునీతులకి చిహ్నంగా వుంటుంది. దానియేలు దర్శనంలో చూచిన దేవుడు మంచులాంటి తెల్లనిబట్టలు తాల్చినవాడు. 7,9. తబోరు కొండమీద శిష్యులు చూచిన క్రీస్తబట్టలు కూడఏ చాకలీ చలువ చేయలేనంత తెల్లగా మెరుస్తున్నాయి. మార్కు9,3. ప్రభువు ఉత్తాన సమయంలో కన్పించిన దేవదూత బట్టలు తెల్లనివి - మత్త 28,3. మోక్షంలో ప్రభువు సింహాసనం చుటూ ఆసీనులైయున్న ఇరువది నల్లురు పెద్దలు తెల్లనిబట్టలను తాల్చి వున్నారు - ప్రక44. ఈ సందర్భాలనుబట్టి జ్ఞానస్నానంలో తెల్లని కండువాను పొందే క్రైస్తవుడు కూడ పిశాచాన్ని పాపాన్నీ జయించి ఒకనాడు దేవుణ్ణి అతని పునీతుల బృందాన్నీ చేరుకొంటాడని అర్థంచేసికోవాలి. ఈ విజయం ఇక్కడే ప్రారంభమై భవిష్యత్తులో మోక్షంలో ముగుస్తుంది.

వివాహపు విందులో పాల్గొనే వాళ్ళకు వివాహపు వస్త్రం అవసరం-మత్త22, 1112. యూదులు మోక్షాన్ని వివాహపు విందుగా భావించేవాళ్లు. పై జ్ఞానస్నానపు కండువా ఈ వివాహ వస్తాన్నిగూడ తలపిస్తుంది. ఇవన్నీమనలను భావిలో రానున్న మోక్షానికి సిద్ధంచేస్తాయి. జ్ఞానస్నానజీవితం ఇక్కడ ప్రారంభమై మోక్షంలో ముగుస్తుంది. మనం ఈ లోకంలోనే క్రీస్తు విజయంలో పాలుపొందడం మొదలిడతాం. కాని పూర్తి పాలు స్వర్గంలో లభిస్తుంది. ఈ విధంగా ఈ సంస్కారం మనకు భవిష్యత్తుతో గూడ సంబంధం కలిగిస్తుంది.