పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంకొకరికి వచ్చేప్పటికల్లా సహించలేక బాధపడిపోతాం. కాని మనం ఈ కీర్తిప్రసిద్దుల కొరకు అర్రులు చాచకుండా మన పని మనం చేసికొంటూ పోవడం మంచిది. అప్పుడు ఆ మంచి పేరు మనకు రాలేదనిగాని ఇతరులకొచ్చిందనిగాని బాధపడం. ఇతరుల మంచిపేరును గూర్చి విన్నపుడు అనవసరంగా అసూయ పడం.

మామూలుగా మనం ఎవరిమిూద అసూయ పడతామో వాళ్ల ప్రస్తావనం వచ్చినపుడు చాల కటువుగా మాట్లాడతాం. విమర్శకు దిగుతాం. ఈ దుర్గణాన్ని మనం ప్రయత్నపూర్వకంగా అణచుకోవాలి, మన మట్టుకు మనం ఆ వోర్చుకోలేని వాళ్ళను గూర్చి మాట్లాడేపుడు సోదరప్రేమను గుర్తుంచుకోవాలి. చేతనైతే వాళ్ళనుగూర్చి ఓ మంచిమాట చెప్పాలి. చేతగాకపోతే నోరుమూసుకొని వూరకుండాలి. అంతేగాని వాళ్ళమిూద ఏటుమాటలూ పోటుమాటలూ విసరకూడదు.

గ్రీకు తాత్వికుడైన అరిస్టోటలు "దేశ కాల ప్రాయ వృత్తి ప్రసిద్ధి బంధుత్వాల్లో మనకు దగ్గరివాళ్ళెవరో వాళ్ళను గూర్చి అసూయపడతాం" అని చెప్పాడు. అతని వాక్యంలో ఆరంశాలున్నాయి. మనకు దూరంగావున్న వాళ్ళను జూచిగాక దగ్గరగా వున్నవాళ్ళను జూచి అసూయపడతాం. మన సమాకాలికులనూ మన ప్రాయంవాళ్ళనూ జూచి ఈర్ష్యచెందుతాం. ఒకేవృత్తిలోవున్న వాళ్ళు ఒకరినొకరు సహించలేరు. ప్రసిద్ధిలోకి వచ్చినవాళ్ళనూ మనకు బంధువులైన వాళ్ళనూ జూచి అసూయచెందుతాం. నిత్య జీవితంలో తోడి జనంతో మెలిగేప్పడు ఈ యారంశాలను గుర్తుంచుకోవడం మంచిది.

5. ఆత్మ శోధనం

1. నీ వెవరిని గూర్చి అసూయ పడుతుంటావో నీకు తెలుసా?
2. నీవు నీలోని ఈర్యాభావాలను శీఘమే గుర్తుపట్టి వాటిని అణచుకొనే ప్రయత్నం చేస్తుంటావా లేక అజ్ఞానంవల్ల వాటికి సులువుగా లొంగిపోతుంటావా?
3. ఇరుగుపొరుగువాళ్న నీవిూద కోపతాపాలు వెళ్ళగ్రక్కేపుడు నీవు వట్టి కుళుబోతువాడివని నిన్ను నిందిస్తుంటారా?
4. నీకెవరిమిూద అసూయ వుందో వాళ్ళ ప్రస్తావనం వచ్చినపుడు కటువుగాను విమర్శనాపూర్వకంగాను మాట్లాడుతుంటావా?
5. ఒకే వృత్తిలో వున్న వాళ్ళు ఒకరినొకరు సహించరు అన్న సూత్రం ప్రకారం నీవు పనిచేసేకాడే పనిచేసే ఇతరులను జూచి నీవు అసూయపడ్డం లేదా?
6. తరచుగా మన దగ్గరి బంధువుల వృద్ధిని జూచి మనం ఈర్ష్య చెందుతాం. ఈ విషయంలో నీ అనుభవం ఏమిటి?
7. నీవు తోడివారి కీర్తిని సహించకపోవడానికి కారణం నీకు కీర్తిరాలేదన్న గుర్రు కాదా?