పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8. వివాహ జీవితంలో బోలెడంత లైంగికాసూయ వుంటుంది. నీ యనుభవమేమిటి?
9. ఓర్వలేని తనంవల్ల నీవెవరికీ యేమియా అపకారం చేయలేదా?
10. నీవు చుప్పనాతితనంతో చిత్తశాంతిని కోల్పోయి మూనసిక వ్యధకు గురౌతూంటావా?

8. కోపం

1. కోపం అంటే ఏమిటి?

మనకు కీడు తలపెట్టినవాళ్ళని శిక్షించాలని కోరుకోవడమే కోపం, కోపం గర్వంనుండి పడుతుంది. ఎదుటివాళ్ళు మనకు అప్రియం కలిగించినపుడు మనం సహించలేం. కనుకనే వాళ్ళమిూద కోపపడతాం.

కోపం మంచిదీ కావచ్చు చెడ్డదీ కావచ్చు క్రీస్తు దేవాలయంలో వ్యాపారం చేసేవాళ్ళమిూద కోపపడ్డాడు - యోహా 2,13-17. అలాగే మోషే విగ్రహారాధనకు తలపడి దూడను కొల్చేవాళ్ళమిూద కోపించాడు - నిర్గ 32, 19. ఇవి మంచి కోపాలు.

కోపం మంచిది కావాలంటే మూడు నియమాలను పాటించాలి. మొదటిది, అది న్యాయయుక్తంగా వుండాలి. తప్పచేసిన వాళ్ళను మాత్రమే శిక్షించేలా వుండాలి. రెండవది, అది మితంగా వుండాలి. అపరాధిని అతని తప్పకి తగినంతగా మాత్రమే శిక్షించాలి, మూడవది, అది ద్వేషంతోగాక ప్రేమతో కూడివుండాలి. దోషిని మంచి త్రోవకు మరల్చాలన్న కోరికేగాని అతనిమిూద పగతీర్చు కొందామన్న కోరిక వుండకూడదు. న్యాయాన్ని నిలబెడదామన్న ఉద్దేశమేగాని ఇతరులకు అపకారం చేద్దామన్న ఉద్దేశం వుండకూడదు. ఈ నియమాలను విూరిన కోపం చెడ్డకోప మౌతుంది. మామూలుగా అధికారంలో వున్నవాళ్ళకీ, బాధ్యత కల వాళ్ళకీ కోపం తగుతుంది. కోపంలో చాల మెట్లున్నాయి. మొదటలో అది ఓర్పుని కోల్పోవడంగా వుంటుంది. తరువాత అది కోపంగా మారుతుంది. ఈ దశలో ముఖం ఎర్రబద్ధం, పెద్దగా అరవడం మొదలైన లక్షణాలు కన్పిస్తాయి. అటుతరువాత అది ఉగ్రకోపంగా మారుతుంది. ఈదశలో తిట్టడం, కొట్టుకోవడం, తన్ను తాను అదుపులో పెట్టుకోలేకపోవడం మొదలైన చిహ్నాలు కన్పిస్తాయి. కడన అది ద్వేషంగా మారుతుంది. ఈ దశలో శత్రువమిూద పగతీర్చుకోవడం, అతనికి కష్టనష్టాలూ చావూ దాపురించాలని కోరుకోవడమూ మొదలైన లక్షణాలు గోచరిస్తాయి. ఈ చివరి దశలో కోపం ఫరోరపాప మౌతుంది. పైన పేర్కొన్న వాటిలో మొదటి మూడు దశలను మాత్రమే మనం మామూలుగా కోపం అంటాం. కాని నాల్గవది కోపమే, అది తీవ్రకోపం.