పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12.

1) దేవుడు నరుని అమరునిగా జేసాడు అతనిని తనవలె నిత్యునిగా జేసాడు కాని పిశాచం అసూయవలన మృత్యువు లోకంలోకి ప్రవేశించింది పిశాచ పక్షాన్ని అవలంబించేవాళ్ళు చావుని చవిజూస్తారు — సలోమోనుజ్ఞాన 2,23-24.
2) అసూయా కోపం ఆయస్సుని తగ్గిస్తాయి - సీరా జ్ఞాన 30,34
3) శాంతగుణంవల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి అసూయ యెముకలలో పుట్టిన కుళ్ళలాంటిది - సామె 14,30

పై ఉదాహరణలనుబట్టి అసూయ యెంతటివారినైనా పట్టిపీడిస్తుందని అర్థం చేసికోవాలి. ఈ దుర్గుణంవల్ల నరులు నీచకార్యాలకు పాల్పడతారని గూడ గుర్తించాలి.

4 అసూయను జయించే మార్గాలు

అసూయాభావాలు అందరికీ కలుగుతాయి. భావాలూ కోరికలూ మన అదుపులో వుండవు. ఈర్ష్యాభావాలు కలిగినంతనే పాపం చేసినట్లుకాదు. ఆ భావాలకు బుద్ధిపూర్వకంగా లొంగిపోయినపుడు మాత్రమే పాపమాతుంది. మన తరపున మనం అసూయాభావాలు కలిగినపుడు వాటిని గుర్తించాలి. నేను అసూయకు గురౌతున్నానని చిత్తశుద్ధితో ఒప్పకోవాలి. అటుపిమ్మట మన హృదయంలోని ఈర్యాభావాలను త్రోసిపుచ్చాలి. నేను వాటికి సమ్మతి జూపను అని నిశ్చయించుకోవాలి.

బహుశః అసూయను జయించడానికి ఉపయోగపడే ఓ వత్తమ మార్గం యిది. మన ఈ భౌతిక శరీరంవుంది. ఈలాగే జ్ఞానదేహం కూడ వుంది. ఈ జ్ఞానదేహానికి క్రీస్తు శిరస్సు, మనం అవయవాలం. జ్ఞానస్నానంద్వారా క్రీస్తుతో ఐక్యమైనవాళ్ళంతా అతనితో కలసి జ్ఞానదేహ మౌతారు. మామూలు దేహంలోని అవయవాల్లో ఒకదాని బాగోగులు మరొకదాని బాగోగులౌతాయి. అలాగే జ్ఞాన దేహంలోని అవయవాల్లో గూడ ఒకదాని బాగోగులు మరొకదానివి కావాలి. అనగా క్రీస్తుతో ఐక్యమైన మనం ఇతరుల లాభనష్టాలను మన లాభనష్టాలుగా ఎంచాలి. కనుక ఇతరుల వృద్ధిని మన వృద్ధిగా ఎంచాలేగాని వారినిజూచి అసూయ పడకూడదు - రోమా 12,5.15.

తరచుగా మనం ఇతరుల మంచిపేరును జూచి ఓర్వలేని తనంతో బాధపడిపోతాం. ఇతరులనెవరైనా కొంచెం పొగడితే సహించలేం. అనగా మనకే కీర్తిప్రసిద్దులు రావాలని కోరుకొంటుంటాం అన్నమాట. ఆ మంచిపేరు మనకు గాక