పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోయింది -10,1,19, అంతియోకయ సమాజం నుండి పౌలుని బర్నబాను సువిశేషసేవకు పిలిచింది - 13, 2-4 రెండవ పేషిత ప్రయాణంలో పౌలుని బితూనియా ఆసియా రాష్ట్రాల్లో వాక్యం బోధింపకనీయకుండా నేరుగా మాసెడోనియాకు ಘಟನಿ పోయింది - 16, 6–7. మూడవ ప్రేషిత ప్రయాణంలో పౌలుకు యెరూషలేమలో బాధలూ శ్రమలూ కాచుకొనివున్నాయని చెప్పింది - 20, 22-23. క్రైస్తవ మతంలో చేరిన గ్రీకుప్రజలు మోషే ధర్మశాస్తాన్నిపాటించనక్కర లేదని యెరూషలేము మహాసభలో నిర్ణయం చేసింది. ఆత్మే - 20, 28. ఈవిధంగా పరిశుద్దాత్మ ప్రేషితులను పురికొల్పుతుంది. ఈ యాత్మ మనలను గూడ ప్రేరేపించి ప్రేషితోద్యమానికి పంపాలని ప్రార్ధన చేసికొందాం.

8. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆనాటి గృహస్థ ప్రేషితులను చాలమందిని పేర్కొంటుంది. సైఫను మరణానంతరం యెరూషలేమునుండి చెల్లాచెదరైన యిూద గృహస్తులు ఫినీష్యా, సైప్రసు, అంతియోకయ ప్రాంతాల్లో క్రీస్తును బోధిస్తూ వెళ్ళారు - 11, 19–20. ప్రిస్మిల్లా అక్విలా అనే దంపతులు పౌలుకు చాల తోడ్పడ్డారు - రోమా 16,3. వీళ్లు అపొల్లో అనే ఉపన్యాసకునికి గూడ క్రీస్తుని బోధించారు - అచ 18,26, యువోదియ, సుంటకే అనే స్త్రిలు క్లెమెంటు అనే అతనీ పౌలుతో కృషి చేసారు - ఫిలి 4,2-3. ఈ గృహస్టుల్లాగే మనం కూడ క్రీస్తు పరిచర్యలో పాల్గొంటే జీవితం ధన్యమౌతుంది.

9. యిర్మీయా ప్రభువుని బోధించకుండా వుండలేక పోయాడు. ప్రభువుని బోధించకుండా ఊరుకొందామనుకొంటే ప్రవక్త ఉదరంలో ఏదో అగ్ని మండి అతన్ని బోధచేయమని నిర్బంధం చేసేది - యిర్మీ 20,9. అలాగే పౌలు కూడ సువార్తను బోధించక పోయినట్లయితే తాను శాపానికి గురౌతానని భావించాడు - 1కొ 9,16. మరి మనం ఈ విషయంలో పట్టీపట్టనట్లుగా వుండవచ్చా?

10. బోధకుల్లో కొందరు ధైర్యం కలవాళ్ళ వీళ్ళు ఎషయాలాగ "ప్రభూ! నేనున్నాను కదా! నన్ను పంపండి” అని ముందుకి వస్తారు - యెష 6,8, కాని కొందరు పిరికివాళ్ళు వీళ్ళు యిర్మీయాలాగ “ప్రభో! నేను బాలుణ్ణి. నన్ను పంపవదు" అని వెనక్కువెనక్కు పోతారు - యిర్మీ 1,6. ఐనా పిరికివాళ్ళనూ ధైర్యశాలులనూగూడ ప్రేపితరంగానికి తోడ్మానిపోయేది పరిశుద్ధాత్మే నాయకత్వవరం ఆయాత్మ ద్వారా లభిస్తుంది.

11. పౌలు తన ప్రేషిత జీవితాన్ని ఓ దీపంతో పోల్చాడు. దీపం తన చమురును తాను వ్యయంచేసికొంటూ మన కోసం వెల్లుతుంది, తాను కాలిపోతూ మనకు వెలుతురు నిస్తుంది. ఆలాగే పౌలుకూడ తన ప్రాణాన్ని సమర్పిస్తూ కొరింతీయుల కోసం కృషి చేసాడు -2కొ 12,15. ప్రేషితులు కాగోరేవాళ్ళల్లో ఈ స్వార్ధరాహిత్యం వుండాలి. ప్రభువు కూడ తన్నుతాను సంతోషపెట్టుకోకుండా మనకోసం సిలువమీద బలి అయ్యాడు - రోమా