పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. క్రైస్తవ సమాజ మంతా కలసి క్రీస్తు జ్ఞానదేహం. ఈ దేహానికి మనమే అవయవాలం. కనుక మనం పనిచేయందే ఈదేహం వృద్ధి చెందదు. మనం కృషి క్రీస్తు దేహమైన క్రైస్తవ సమాజాన్ని పెంపులోకి తీసికొని రావాలి - ఎఫే 4,16.

4. పైగా మనం దీపస్తంభంమీద పెట్టిన దీపంలాంటి వాళ్ళం. పర్వతంమీద నిర్మించిన నగరం లాంటివాళ్ళం. మన వెలుగూ ఉనికీ ఇతరులు గుర్తించాలి — మత్త 5, 14-16. ఇంకా మనం ఇతరులకు క్రీస్తును బోధించాలి అంటే మొదట ఆ క్రీస్తు మన హృదయంలో వుండాలి. తల్లితీగలోనికి అతుకుకొని వున్న రెమ్మల్లోకి ఆ తీగ సారం ప్రవేశిస్తుంది. ఆలాగే మనం కూడ ప్రార్థన ద్వారా క్రీస్తులోకి ఐక్యమైతే అతని సారమూ శక్తి మనలోనికి ప్రసరిస్తుంది - యోహా 15,5.

5. ఒకోమారు మన గురువులూ మఠకన్యలూ గృహస్థ ప్రజలను ప్రోత్సహించరు. ప్రేషితకార్యాలన్నీ చేస్తే తామే చేయాలి కాని మరెవ్వరూ చేయకూడదు అనుకొంటారు. గృహస్థలను ప్రేషిత కార్యానికి ప్రేరేపించరు. కాని ఇది పెద్ద పొరపాటు, ఆత్మ గురువులకూ మఠకన్యలకూ మాత్రమే కాదు, గృహస్తులకూడ వరాలిస్తుంది - 1కొ 12, 7; 11. ఆత్మ గృహస్తులకు ఇచ్చే యీప్రత్యేక వరాలను గురువులు అణచివేయకూడదు. దీపాన్ని ఆర్చివేసినట్లుగా వాళ్ళ వరాలను ఆర్పివేయకూడదు - తెస్సి 5, 12; 19-20 గురువులు గృహస్తులను ప్రోత్సహించి వాళ్ళచేత ఆయా ప్రేషిత సేవలు చేయించుకోవాలి. గృహస్టులు తమ తరుపున తాము గురువు మాట విని అతని సలహాలను పాటిస్తుండాలి. తాము అతని నాయకత్వం క్రింద పనిచేస్తుండాలి. ఈ సమన్వయం కుదిరిన తావుల్లో చక్కని సువిశేష బోధ జరుగుతుంది. చూడు, వాటికన్ చట్టం - గృహస్తుల ప్రేషిత ఉద్యమం - నంబరు 3.

6. క్రీస్తుకి పండ్రెండు మంది శిష్యులేగాక 72 మంది శిష్యులు కూడ వుండేవాళ్ళ ప్రభువు వాళ్ళను తనకంటె ముందుగా ఆయా వూళ్ళకు పంపాడు. వాళ్ళ వెళ్ళి ప్రజలను క్రీస్తు రాకకు సిద్ధం చేసేవాళ్ళ -లూకా 10,1. మన గృహస్థనాయకులు కూడ ఈలాగే పల్లెలకు వెళ్ళి మున్ముందుగా అక్కడి సమాజాలను సిద్ధం చేయాలి. వారి తరువాత గురువులూ మఠకన్యలూ ఆ పల్లెలకు వచ్చి అక్కడి ప్రజలకు నానారూపాల్లో క్రీస్తును అందిస్తారు.

7. మనకు ప్రేషిత వాంఛ పట్టించేది పరిశుద్ధాత్మే అపోస్తలుల చర్యల్లో ఆయాత్మ పేషితులను నడిపించిన తీరు అద్భుతంగా వర్ణింపబడివుంది, ఆత్మ ఫిలిప్పను ఇతియోపీయుని వద్దకు కొని పోయింది - 8, 29. పేత్రుని కొర్నేలి వద్దకు నడిపించుకొని