పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2) ఈ భాషలు దైవసందేశంకూడ Sošč). సమావేశంలో ఒకడు తనకు అర్థంకాని స్వరాలతో మాట్లాడతాడు. మరొకడు ఆ స్వరాల అర్థం తెలియజేస్తాడు, ఈ యర్థం చెప్పడమే దైవ సందేశాన్ని వివరించడమౌతుంది. తరువాత ఆ సందేశం వర్తించే వాళ్లను విచారించి చూడగా అతడు అందించిన దైవ సందేశం నిజమేనని తేలుతుంది. పౌలు ఈలాంటి ఉదంతాలను 1కొ 14,5లో పేర్కొన్నాడు. ఈ నాడును పెంతెకోస్తు సమావేశాల్లో ఈలాంటి సంఘటనలు జరుగుతూంటాయి.

3) ఈ భాషలు ప్రార్ధనంకూడ కావచ్చు. పెంతెకోస్తు సమావేశాల్లో భక్తులు నెమ్మదిగా పెదవులు కదిలిస్తూ ప్రార్ధనం చేస్తారు. ఈ ప్రార్ధనా శక్తికూడ దేవుడిచ్చే వరమే. ఇక ఈ యధ్యాయంలో చెప్పాబోయే అంశాలన్నీ ఈ మూడవ అర్థమైన ప్రార్థనకు సంబంధించినవే.

2. భాషలలో మాటలాడి ప్రార్ధనం జేయడమంటే గ్రీకుహీబ్రూ లాంటి ప్రజలకు తెలియని భాషలు మాటలాడ్డంగాదు. తనకు అర్థంగాని పదాలు వాడి ప్రార్ధనం చేయడమని భావం. పౌలు "భాషలలో మాటలాడే వాళ్లు మానవులతోగాక దేవునితో మాటలాడతారనీ, ఆ మాటలను ఎవరూ అర్థంచేసికోలేరనీ వ్రాసాడు - 1కొ 14,2. ఆ భాషను వాడి ప్రార్థనలుచేసే అతనికి గూడ ఆ మాటలు అర్ధంకావు, 14,14. ఈలాంటి ప్రార్ధనలో మనయాత్మ దేవునియాత్మ సహాయంతో, మన బుద్ధికీ భాషకీ గూడ అందని ధోరణిలో ప్రార్థన చేస్తుంది - రోమా 8,26, 27.

3. ఈ ప్రార్ధనం ప్రాముఖ్యం ఏమిటి?

1) భాషలలో మాటలాడి ప్రార్ధనం చేసేపుడు మన బుద్ధిశక్తిని దాటిపోతాం. ఎటూ మన భాషద్వారాగానీ మన బుద్దిశక్తి ద్వారాగానీ ఆ భగవంతుణ్ణి అందుకోలేం గదా! అందుకే పూర్వ తాత్వికులు అతన్ని గూర్చి చెపూ “నేతి నేతి" అన్నారు. అనగా ఆ భగవంతుడు ఈలాంటివాడుకాదు, ఆలాంటివాడుకాదు అని భావం. మరి అతడు ఏలాంటివాడు అంటే మన బుద్ధి శక్తితో గ్రహించలేనివాడు అని అర్థం. కనుక ఈ ప్రార్ధనం మన విజ్ఞాన గర్వానికి విరుగుడు మందులాంటిది. అల్ప మానవుని విజ్ఞానంతోనే అన్నీ సాధించలేమని భాషా భావాలూ కూడ కొరతపడిన ఈ ప్రార్ధనాపద్ధతి నేర్పుతుంది.

2) మన నాలుక చిన్నదైనా చాల గొప్పగా డాబులుకొడుతుంది - యాకో 3,5. మనం ఈ నాలుకను ఉపయోగించి మాటలాడేప్పడూ, కడకు ప్రార్ధనం చేసేపుడు గూడ మనలను గూర్చి మనమే గొప్పగా ఎంచుకొంటాం. మనమే తెలివైన వాళ్లం అనుకొంటాం. కాని భాషల్లో మాటలాడే ఈ ప్రార్థనలో భగవంతుడు మన నాలుకను అణచివేస్తాడు.