పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7. ఈ వరాలను సాధించడం ఏలా? మనంతట మనం స్వీయశక్తితో ఈ వరాలను పొందలేం, ఆత్మే వీటిని తన భక్తులకు అవసరమైన కొలదీ పంచిపెడుతుంది - 1కొ 12, 7. కనుక మనం ఈ వరాలకోసం ఆ యాత్మనే అడుగుకోవాలి. ఆత్మ వరాలను పొందడంకోసమై మన తరపున మనం తయారయ్యే మార్గాలు కొన్ని వున్నాయి. ప్రార్ధనం చేసికోవాలి. బైబులు వాక్యాన్ని శ్రద్ధతో పఠించాలి. చిత్తశుద్ధి అలవరచుకోవాలి. పేదసాదలవట్ల దయా సానుభూతీ పెంపొందించుకోవాలి. వినయమూ, నిరాడంబరగుణమూ సరళస్వభావమూ సేవాభావమూ అలవర్చుకోవాలి. ఈలా తమ్ముతాము తయారుచేసికొన్నవాళ్ళ ఆత్మ వరాలను పొందుతారు.

8 కడన రెండంశాలను గుర్తించాలి, మొదటిది, సేవావరాలు మంచివేకాని ఇవి క్రైస్తవ జీవితానికి ప్రధానంకావు, ఇవి వున్నవాళ్ళ తప్పకుండా మంచివాళూ గొప్పవాళూ అని చెప్పలేంగూడ, కనుక వీటికి విపరీతమైన విలువ నీయకూడదు. రెండవది, ఈ వరాలను చిన్నచూపు చూడనూ కూడదు. కొందరు వరాలను చిన్నచూపుచూచి సంప్రదాయబద్ధతా విధేయతా అనే గుణాలను ఎక్కువగా మెచ్చుకొంటారు. కాని ఇది పొరపాటు, ఆత్మవరాలను మనం ఆదరంతో అంగీకరించాలి, వాటిని సరిగా వాడుకోవాలి. పౌలు ఆత్మను ఓ దీపంలా ఆర్పివేయవద్దని హెచ్చరించాడు -1 తెస్స 5,19.

వరాలన్నిటికీ విలువిచ్చేది పేమ. ప్రేమలేనికాడ వరాలు స్వోత్కరను ప్రకటించుకోడానికి ఉపయోగపడతాయి కాని సేవ చేయడానికి ఉపయోగపడవు. కనుకనే పౌలు అన్నిటికంటె ప్రేమకు అధికమైన విలువనీయమని కొరింతీయులకు బోధించాడు1Ց՞ 13, 13,

14 భాషల్లో మాటలాడ్డం

1. భాషల్లో మాటలాడ్డం అంటే నూత్న వేదంలో మూడర్గాలున్నాయి :

1) ఈ భాషలు సమాచార సాధనం కావచ్చు. అనగా మనం శ్రోతలకు తెలియని భాషలో మాటలాడినా ఆ మాటల భావాన్ని వాళ్ళు గ్రహిస్తారు. పెంతెకోస్తుదినాన అపోస్తలులు వాళ్ళ భాషయైన అరమాయిక్ లో మాట్లాడుతున్నారు. కాని విదేశాలనుండి వచ్చి అక్కడ గుమిగూడియున్న యూదులందరికీ ఆ యపోస్తలులు వాళ్ళవాళ్ళ భాషల్లో మాటలాడుతున్నట్లుగా విన్పించింది - ఆచ 2,6. ఇక్కడ అద్భుతం మాటలాడేవాళ్లల్లో గాదు, వినేవాళ్ళల్లోవుంది. ఇది అసాధారణమైన సంఘటనం.