పుట:Bhagira Loya.djvu/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

గోదావరి వరదలా ఇంట్లోకి చక్కావచ్చింది.

"అమ్మా, వీధిగదిలో నుంచున్న అమ్మాయి ఎవరే?"

"నాన్నగారి దగ్గిర సంగీతం నేర్చుకుంటూవున్న ఒక బొమ్మలాళ్లమ్మాయి."

"బొమ్మలా ళ్లేమిటేవు?"

"తోలుబొమ్మలాళ్లే."

"తోలుబొమ్మలాళ్లకి సంగీతం యేమిటి?"

"ఆ అమ్మాయి కంఠం కిన్నరీ కంఠం. అంత అందమైన కంఠం నేనెక్కడా వినలేదు సుమా! సంగీతంలో కూడా మీకు తగ్గ తెలివితేటలున్నాయి. ముచ్చటపడి నీకు యెంత బాగా సంగీతం నేర్పారో అంత యిదిగాను మీ నాన్నగారు యీ అమ్మాయికి నేర్పుతున్నారు మా మంచిపిల్ల. నేనంటే ప్రాణం. కూతుళ్లిద్దరు కాపరాల కెళ్లినందుకు నాకు మూడవ కూతురైంది."

ఆ రోజునుంచే విజయకి మీనాక్షికి కృష్ణా, తుంగభద్రా సంగమమైనది. విజయానందని పుట్టింట రెండునెలలు వుంది. ఆ రెండు నెలలలో వేణీభరం కూర్చే పద్ధతుల్లో, సొగసైన వస్త్రాలు యెన్నుకొనే విధాలల్లో, నగలు అలంకరించుకొనే రీతుల్లో, పువ్వులు ముడుచుకొనే మోస్తరుల్లో, మొహానికి 'మంచులు', వెన్నలు, పవుడర్లు, పెదవులకు, బుగ్గలకు రంగులు సొగసు చేసుకొనే సూత్రాలల్లో, టాల్కం పొడులు దేహానికి అద్దుకునే అందాలల్లో, యూడీకొలోను,

70