పుట:Bhagira Loya.djvu/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

సీతా -- ఓయి పిచ్చివాడా, పోనీ తోలుబొమ్మలు చచ్చిపోతాయే అనుకో. ఈ రోజుల్లో సంగీతం నేర్చుకున్న వాళ్ళకి డబ్బెక్కువ. సంగీతసభలు, సంగీత స్కూలుమేష్టర్లు, సంగీత గ్రామఫోనుప్లేట్లు, సంగీత సినీమాలు, ఆడవాళ్లు నాటకాల్లో వేషాలు వేయడం, ఎక్కడ జూసినా సంగీతానికే యీ రోజుల్లో డబ్బు. అల్లాంటప్పుడు కాస్త గట్టిగా సంగీతం నేర్చుకుంటే మీ కుటుంబమునంతా అదే పోషించగలదు. గౌరవము సంగతి జెప్పక్కర్నేలేదు. యేవంటా వోయ్ విఠలయ్యా ?

విఠ -- నిజం, సామీ ! మా అప్ప ముసలివాడు. వాడి కేమి తెలుసు. మా అమ్మణ్ణి మీ దగ్గర వుంచుదురు సామీ.

వీరయ్యకూడా వొప్పుకున్నాడు.

4

కామేశ్వరరావు యమ్. ఎ. గారికి సాలుకు వెయ్యి రూపాయలు వచ్చే ఆదాయం వుంది. ఏ వుద్యోగానికైనా ప్రయత్నించాలని వుంది. కాని ఇంటిదగ్గర తల్లితో ఒక తమ్ముడితో సంసారము పొదుపుగ కాలక్షేపం చేసుకుంటున్నాడు. ఉద్యోగాలకి దరఖాస్తులు పెట్టడం, తిరగడం, ప్రాధేయపడ్డం అతగాడు యెంతమాత్రం సహించలేక పోయాడు. కాంగ్రెసు అంటే అభిమానం. సాధ్యమైనంత వరకు స్వదేశీవస్తువులే కొంటూ వుంటాడు.

62