పుట:Bhagira Loya.djvu/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొమ్మలరాణి

ఆ రాత్రి తోలుబొమ్మలాట. ఎనిమిదిగంట లయ్యేటప్పటికి పందిరి తయారయింది. ఊళ్ళో బట్టలషావుకార్లు తటవర్తివారి నడిగి ఒక అరతాను కోరామల్లు పట్టుకువచ్చి తెరకట్టారు. తెర అడుగున గట్టి తడకలు గట్టారు. ఆరు పెద్దమండిగల్లో శేరుశేరు ఆముదంపోసి ఇనప కొంకెలలో పెట్టి తెర వెనకాల వేళ్లాడతీశారు.

తొమ్మిదింటికి ఊళ్లోవుండే పాటకజనులు, కాపులు, హరిజనులు మొదలగు యావన్మందీ వచ్చి తోలుబొమ్మల పందిరిముందర కూర్చున్నారు. తెరవెనుక దీపాలు వెలిగించారు. వెలిగించడంతోటే తెరమీద రాములవారు, లక్ష్మణస్వామి, హనుమంతుడు, జాంబవంతుడు, సుషేణుడు యింకా మూడు కోతులు యీ పక్కా ఆ పక్కా చెట్లు కాక యెనిమిది విగ్రహాలున్నాయి,

దీపాలు వెలిగించడం తోటే "తొండము నేకదంతమును" అనే పద్యం చక్కని గొంతుకతో తెర అవతల ఒక వృద్ధకంఠం ఆలాపించింది. ఒక వానరుని బొమ్మ తీసి ఆ

53