Jump to content

పుట:Bhagira Loya.djvu/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'


తొమ్మిది నెలలలో వెన్నెల ముద్దకట్టి నాకు ఓ పాపాయి ప్రత్యక్షమైంది.

'ఆసి బంగారుతల్లీ ! అచ్చంగా తండ్రిపోలిక, వదిన గారూ!' అన్నది రత్నం పాపాయికి నీరుపోస్తూ!

ఈ నా కన్నతల్లి భరతాంబ మరదలు. మా వారి ప్రేమమూర్తికట్టిన వరలక్ష్మీ! నరసన్న మా అన్నయ్యచేత దెబ్బలుతిన్నప్పుడు ఏడ్చిన ఏడుపులో ఉన్న కరుణరసం నిండిన కలశం! వచ్చింది. ఆమెకు మేము 'పూర్ణస్వరాజ్య లక్ష్మి!' అని పేరుపెట్టుకున్నాం.


52