పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆఱవ ప్రకరణము

ఫిలడల్ ఫియాకు తిరుగుదల

కప్తాను క్లార్కుచే గడపబడిన 'బెర్కుషియరు' యోడలో బెంజమిను బయలు దేరెను. జూలై 21 తేది మధ్యాహ్నమున, 'గ్రేవు శెండు' యొద్ద వీరు లంగరువేసిరి. "ఇది పాడుప్రదేశము. ఇక్కడి ప్రజలు మార్గస్థులను మోసపుచ్చుటయే పనిగాగల వారలు. వీరియొద్ద వస్తువులను గొని, వారు గోరిన వెలలలో సగము నిచ్చిన, ఇవియు నిజమైన వెలకు రెండింతలుండును. దైవానుగ్రహమున నిక్కడినుండి రేపు బయలుదేరుచున్నార" మని బెంజమిను వ్రాసెను. మరునాడు బయలుదేరి, పోర్ట్సుమతు రేవులో లంగరు వేసిరి. ఓడల గమ్యస్థానము (Harbour) జూచుటకు కప్తాను, డెనుహాము, ఇతని లేకరి, ముగ్గురు వోడదిగి పట్టణములోనికి వెళ్లిరి. అనేక దినములవఱకీ యోడ 'పోర్ట్సుమతు వైటు' దీవికి మధ్యప్రదేశమున నుండెను. ఈ లోపున బెంజమిను 'వైటుదీవి' లోనికి బోయి "కారిసుబ్రూకు" దుర్గము మొదలగువానిని దర్శించెను.

మరి కొన్నిరోజులవఱకు, వైటుదీవి రేవులో నోడ లంగరు వేయుచు, ఎత్తుచు, సోలాంటునదిపై దేలుచు, సముద్రమునకు