పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ ప్రకరణము

లండనుకు ప్రయాణము

ఉదయమున లేచి, వస్త్రములను ధరించి, యోగ్యతాపత్రికను బట్టుకొని, ముద్రాక్షరశాలాధికారియైన, 'బ్రాడుఫర్డు'ను జూచుటకు బెంజమిను వెళ్లెను. అత డితనిని మర్యాదచేసి, మాటలాడి, భోజనము చేయు మని నిరోధించెను. తదనంతర మతడు, తనశాలలో బనిజేయువా డప్పటి కనావశ్యకమని జెప్పి, 'కీమరు' అను నతడు నూతనముగ ముద్రాక్షరశాలను స్థాపించినందున, నతనికి బనివాండ్రు గావలసియుండు నని నుడివి, యతడు గూడ జరుగురు లేదనిన పక్షమున, తాను బెంజమినుకు బసయిచ్చి, చిన్న చిన్న పనులలో నప్పుడప్పుడు నియోగించుట కిష్టపడెను.

కాలాతీతము కానీయక, వెంటనే కీమరును జూచుటకు బెంజమిను వెళ్లెను. ప్రాతగిలి శిధిలమైన అచ్చుయంత్రమువద్ద, నరిగిపోయిన యక్షరపూసలతో బనిని జేయుచున్న 'కీమరు'ను కచ్చేరిగదిలో బెంజమిను దర్శించెను. వచ్చిన వానినిజూచి, కీమరు కొన్ని ప్రశ్నలువేసి, బెంజమినుయొక్క పని నేర్పును పరిశోధించి, తనకు జరుగురు లేదని చెప్పి యతనిని బంపివేసెను.