పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బెంజమిను చాలదినములవఱకు బ్రాడుఫర్డు గృహములో బసచేసి, కొంచెము కొంచెము పనిజేయుచు వచ్చెను. తుదకు బెంజమినుకు కీమరు కబురుపంపి పిలిపించి, పనిలో నియోగించెను. నూతనముగ ముద్రించుట కుపయుక్తములగు సామగ్రులను దెప్పించినందున, చిన్న పుస్తకములను ముద్రింపించి, కీమరు వానిని బ్రచురించుచుండెను. తనకు ప్రతికక్షలో జేరిన 'బ్రాడుఫర్డు' గృహములో బెంజమిను బసచేయుటకు సమ్మతింపక, కీమ రితనిని రీడుధొరగారింటికి తీసికొనిపోయి, యక్కడ బసయేర్పాటు చేసెను. ఆ నాడాది వారమున నితను రొట్టెను దినుచు వీధి వెంబడిని బోవుచుండ, గుమ్మములో నిలబడి, బెంజమినుయొక్క వికారవైఖరినిజూచి యాశ్చర్యమును బొందిన 'కన్యకరీడు' యొక్క తండ్రియే యీరీడు ధొరగారు.

దినదిన ప్రవర్థమానముగ, మంచి వేతనములను బెంజమిను సంపాదించుచు, తగుపాటి స్నేహితులతో సాయం సమయముల గ్రీడించుచు, తనయన్న గారి నిరంకుశాధికారముచే బోస్టను పట్టణమం దసహ్యము కలవాడై, తన పూర్వపు స్నేహితుడు, జానుకాలిన్సుతో దప్ప, తదితరులతో నుత్తర బ్రత్యుత్తరములు లేక యుండెను.

కొంతకాలమునకు స్వగృహమునుండి క్షేమవార్త వచ్చెను. బెంజమిను చెల్లెలు, బోస్టను డెల వేరు పట్టణముల మధ్యస్థముగ