పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డెల వేరు నదీతీరముననున్న 'బర్లింగుటను' పట్టణము అంబాయి పట్టణమునుండి, యేబది మైళ్లదూరము. ఈపట్టణమునకు వెళ్లుట కుద్యుక్తుడై, మరుచటి దిన ముదయ ప్రభృతి క్షోణి పాతముగ వర్షించుచున్నను, బయలుదేరి, దినమంతయు నడిచి, సాయంత్రమునకు దారిలోనుండిన పూటకూలి యింటిలో బసచేసెను; ఇన్ని దినముల కితని మనోధైర్యము చెడి, స్వగృహ మెందుకు విడిచితినని బెంజమిను విచారించెను. పరారియై వచ్చిన తన నెవరైన నిరోధింతు రనుభయము కలిగి, వ్యాకులచిత్తుడయ్యెను. తానుధరించిన వస్త్రములు వర్షములో దడిసి నలిగిపోయినందున, బెంజమిను కర్తవ్యాంశము తోపక యుండెను. వికసిత ముఖారవిందము, శరీర సౌష్టవము గలిగి, భవిషదుద్యోగార్హు డైనను, ప్రస్తుతము దురవస్థలో జిక్కెను.

మఱుసటి దినము బయలుదేరి పోయిపోయి, సాయంత్రమునకు బర్లింగుటనుకు పదిమైళ్ల దూరములో బసచేసి, రెండవదినము శనివార ముదయమున పట్టణము జేరెను. ఫిలడల్‌ఫియాకు పదునేడుమైళ్లు మీదుగ, బర్లింగుట నున్నది. నదీతీరమునకు బోవలెనని వీధుల వెంబడి బెంజమిను వెళ్లెను. ఏ ముదుసలి దానివద్ద తినుటకు రొట్టెను కొనెనో, నామె, జీర్ణ వస్త్ర ధారియైన బెంజమిను మహత్తుకలవాడని, యెంచెను. నదీతీరమునకుబోయి, ప్రతిశనివారమును ఫిలడల్‌ఫియాకు వెళ్లు