పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతము


మహాపురుషులు - వారి జీవితచరిత్రములు

సృష్టియనాది అందులోని జంతువు లనంతములు అండజ. పిండజ, ఉద్భిజ, శ్వేదజములని వానిలో దరగతులు గలవు, వీనిని జేతనము లని యెదరు తరుశైలపాషాణము లచేతనములు ఈ నేలినాచేతనములలో మనుజుడు రాజు నిద్రాహారసంగమము లన్ని జంతువులకు సమానవై నను, వీని నన్నిటికంటె యెక్కుడగు బుద్ధికలవారు మనుజులు.

మొదట మనుజులు దిగంబరులై, నిలుచుటకు నీడ, తినుటకుగూడును లేక. పశుప్రాయులవలె సంచరించుచుండిరి. ప్రకృతిలో 'పరిణామము' (Evolution) ననుసరించి, పిపీలికాది జంతువు లారోహణముగ, గ్రమముగ వానరరూపమెత్త యా వానరముఖమే, సీత, దమయంతి, తారా మొదలగు స్త్రీలయొక్క పూర్ణ చంద్రముఖముగ మారుటకును, ఆ వానరుని బుద్ధియే, కాళీదాసు, భోజుడు, చాణక్యుడు, శంకరుడు మొదలగు మహాపురుషుల కుశాగ్రబుద్ధిగ మార్పునొందుటకు నెంతకాలము పట్టియుండునో మనము చెప్పలేము. అటులనె, మనమిప్పుడు నాగరికులమని విఱ్ఱవీగుచు బ్రగల్బములు బలుకు నీస్థితికివచ్చుట కెంతకాలము బట్టియుండును?

జుట్టులను బెంచి, తీరుగ వానిని దిద్దుటయా, ద్రాక్షారసము నాస్వాదించుటయా, వీనిలో నేది నాగరికము? ఆ పదమున కర్థ మేమి? పండితపామరులు దానిని వాడుక చెయుదురె? అది నిర్గుణమా, సగుణమా? "ఏమి చెప్పుదును