పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యాపారము సాగినకొలది స్వగ్రామస్థులమన్న నల నతడు బొందుచు వచ్చెను. పురాతనపద్ధతి నవలంబించి పట్టణమును రాత్రి వేళల కాపాడువారి సంఘమును సంస్కరించుట కితడు మొదట సమకట్టెను. "ఎపేట తలారు లా పేటను రాత్రి వేళ గాపాడుచుండిరి. రాత్రిసంచారములో దనకు దోడుగ నుండుట కింటి యజమానుల కొందఱిని తలారి పిలుచుచుండును. అటుల తోడుగ బోవుట కిష్టములేనివారు, తలారికి సంవత్సరమునకు సుమారయిదు రూప్యము లిచ్చుచుండిరి. ఈ ధనమును వేతనముగ నిచ్చి, వీ డితరులను దనకు సహాయముగ రాత్రి వేళలదీసికొని బోవుటమాని, యాధనమును తానేవాడుకొనుచుండెను. ఇందుచేత వానిపని బాగుగనుండెను. ఒకది రాము సారాయిని తలారివలన బుచ్చుకొని, యతనివెంట ననేక దుండగీండ్రుపోవుచున్నందున, వారితో గలిసి తలారితో బోవుటకు గొందఱు గృహస్థు లిష్టపడలేదు. వీరు గస్తీతిరుగుట మానివేసిరి. చాల రాత్రులు వీరు త్రాగి మైమఱచియుండుట కల"దని బెంజమిను వ్రాసెను.

'అగ్ని నివారణ సైన్యము' నొక టితడు స్థాపించెను. ఈ దండులో జేరిన ప్రతివాడు తోలుసంచులు, బుట్టలు మొదలగువానిని సిద్ధముగ నుంచుకొనవలెను. ఎక్కడనైన, నిప్పు తగులుకొనిన, నా స్థలమునకు వీరందఱు తమవస్తువులతో