పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బోయి, నిప్పునార్పు చుండిరి. నెలకొక పర్యాయము వీరు కలిసికొనుట కలదు. అప్పుడు, కాలానుగుణముగ, దండు యొక్క పద్ధతులను మార్చుటయో, లేక నూతనపద్ధతులను జేయుటయో జరుగుచుండెను.

1743 సంవత్సరము మే నెలలో, "అమెరికా శాస్త్రపరిశోధన సంఘము"ను స్థాపించుట కితడు ప్రయత్నముచేసెను. ఈ సంఘముయొక్క ముఖ్యోద్దేశములను వ్రాసి, యతడు స్నేహితులకు బంపెను. మొక్కలు, దుంపలు, వేళ్లు, వీనిగుణములు, నుపయోగములు, వీనిని నలుగురికి తెలియజేయు విధము, ఖనులు, లోహములు, వర్తకవిశేషములు, నదులు, వీనియుపనదుల సంగమము, సరస్సులు, పర్వతములు, ఉపయోగమైన జంతువులను వృద్ధిజేయుట, తమదేశములో లేని జంతువులను బరదేశములనుండి తెప్పించి, వానిని బెంచువిధము, మొక్కలు నాటుట, తోటలు వేయువిధము, ఈ మొదలగు విశేషాంశములను జర్చించుటకు నీ సంఘమును సమకూర్ప వలెనని బెంజమిను కోరెను. "తనకంటె గొప్పవాడు సమకూడు వఱకు, యోచనాంశములను వ్రాసి పంపినటువంటి బెంజమిను, సంఘమునకు కార్యదర్శిగ నుండుటకు సమ్మతించెను" అని బెంజమిను వ్రాసెను. సంఘము రూపముబొంది కొన్ని సంవత్సరములవఱకు వర్దిల్లెను. అయినను, దీనివలన గలిగిన మేలు