పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుడు, నామనస్సు కరగును. ఎల్లప్పు డామె సంతోషముగ నుండును. ఇతరుల లోపాలోపములను సవరణచేయు స్వభావము కలది. స్వల్పవిషయములనుకూడ పట్టుదలతో జూచుచుండును. స్వల్పవిషయములలోనే మనుజులు సంతుష్టి చెందవలెను. 18 వ శతాబ్దమున జీవించుటచేత నామె చదువరి కాదు. ఉత్తరముల నామె తెలివితేటలతో వ్రాసినను, వాని వర్ణక్రమము సరియైనదికా"దని పరదేశములో నుండినపుడు బెంజమిను వ్రాసెను. ఆమె చక్కనిది, ఆమె ముఖారవిందము వికసించియుండును. ఆమె పిల్లలు, మనుమలు చక్కనివారని నూతనసీమలలో బ్రసిద్ధి కెక్కిరి.

అతడు స్త్రీలోలుడుకాకపోయినను, భార్యను మృదువుగను, దయతోను, యుక్తముగను జూచుచుండెను. ఇట్టి భర్తను బొందినందు కామె గర్వించెను. ఇరువు రన్యోన్యానురాగము కలవారలు."మే మొకరి నొకరు సంతోషింప జేయవలయునని కోరుచుంటిమి" అని బెంజమిను వ్రాసెను. "మాయొద్ద, పనికి మించిన సేవకులు లేరు. మేము సంసారపక్షముగ నుంటిమి. లేనిపోని భేషజములు మాకు లేవు. సుమారు పదు నెనిమిది రూప్యముల కొక వెండిగరిటెను నాభార్యనాకు తెలియకుండకొనెను. నేడు మొదలు వెండిసామాను, పింగాణివస్తువులు మాయింటిలో కనబడుచుండెను. మేము ధనవంతుల మైనకొలది, నీ