పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యెంచి, కన్యకగాడ్ఫ్రీతో నన్ను మాటలాడనీయనందున, నామె నా కగుపడలేదు. నేనుగూడ వెళ్లుట మానివేసితిని. ఈ విధమున నాకామెయం దనురాగమున్నది లేనిది వారు తెలిసికొన గోరి రేమోగాని, నేనుమాత్రము కోపముచేత వెళ్ల లేదు. అందుచేత, వారు కలవరపడి, రమ్మనుమని నాకు వర్తమానము బంపినను, నేను వెళ్లలేదు. ఇల్లంతయు నాకువదిలీ, వారు లేచి పోయిరి. నేను మరియెవరిని బసలో దింపలే" దని బెంజమిను వ్రాసెను.

కన్యకరీడు, యీలోపున నొంటరిగనుండి కుందుచుండెను. వాస్తవముగ, కుమ్మరిరోజర్సు చనిపోయెను. అప్పుడప్పుడు, బెంజమిను గృహిణిరీడును జూచుటకు వెళ్లుచుండెను. ఆమెకు సలహా నిచ్చుటకలదు. కన్యక యొక్క దురవస్థకితడు వగచు చుండెను. అందుచేత, మనస్సును కుదురుచేసికొని, యే కష్టములు వచ్చినను భరించుటకు నిశ్చయించి, 1730 సంవత్సరము సెప్టెంబరు నెలలో బెంజమిను కన్యకరీడును వివాహమాడెను.

గృహిణి బెంజమి నన్ని విధముల ధర్మచారిణియై యుండెను. భర్తకు పనిపాటలలో సహకారియై, గృహకృత్యములను నేర్పుగ నిర్వర్తించుచు, నామె దయాపూర్ణురా లనిపించుకొనెను. "స్వయముగ కుట్టిన, లినెను, రోమపు దుస్తులను, నేను ధరించుట కామె యిచ్చును. ఈ సంగతి జ్ఞాపకము వచ్చిన