పుట:Balavyakaranamu018417mbp.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లందలి లకారము లఘువు. వర్ణ సమామ్నాయమందలి ళ కారము వర్ణాంతరముగాని యలఘు ళ కారము గాదని యెఱుంగునది. అతఁడు వలికె నిత్యాదులందున్న పాదేశవకారము లఘువు. తక్కిన వకార మలఘువు.

19. సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష తత్సమంబు.

సంస్కృతము సంస్కృతసమము

రామః ... రాముఁడు

విద్యా ... విద్య

హరిః ... హరి

ధేనుః ... ధేనువు

భూః ... భువి

పితా ... పిత

గౌః ... గోవు

నౌః ... నావ

దౌః ... దివి

హృద్‌ ... హృది

జగత్‌ ... జగత్తు, జగము

ఇత్యాదు లూహ్యంబులు.

సంస్కృతము ప్రాకృతము ప్రాకృతసమము

అగ్నిః ... అగ్గీ ... అగ్గి

ఆటిః ... ఆడీ ... ఆడి