పుట:Balavyakaranamu018417mbp.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గర్వ గర్విష్ఠుండను నన్ను - మీరలు పెద్దలు - ఇత్యాదులు ప్రాయిక గ్రహణముచే రక్షితంబులయ్యె.

35. అది శబ్దంబునకు వు ను లు పరంబు లగునపుడును సంబోధనంబు నందును దాన యను నాదేశం బగు.

నీవు చిన్నదానవు - నేను జిన్నదాన - ఓ చిన్నదాన.

36. అన్య యుష్మ దస్మ త్కార్యంబులం దుత్తరోత్తరంబు బలీయంబు.

వారును మీరును ధన్యులరు - మీరును మేమును ధన్యులము.

37. ఏక వాక్యంబునం దొకానొక్కండు తక్క సర్వపదంబులు క్రమ నిరపేక్షంబుగం బ్రయోగింపం జను.

పూర్వమిది పరమిది యను నియమ మపేక్షింపక వాక్యమందెల్ల పదంబులు వలచినట్లు ప్రయోగింపదగును. ఏని ప్రభృతి శబ్దములు కొన్ని నియమ సాపేక్షంబు లయియుండు. గాలి చల్లగా వీచెను - వీచెను జల్లగా గాలి - చల్లగా గాలి వీచెను - వీచెను గాలి చల్లగా - గాలి వీచెను చల్లగా - చల్లగా వీచెను గాలి.


ఇది కారక పరిచ్ఛేదము.