పుట:Balavyakaranamu018417mbp.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమాసపరిచ్ఛేదము.

1. సమర్థంబులగు పదంబు లేక పదం బగుట సమాసంబు.

ప్రథగ్భూతంబులగు నర్థంబుల కేకార్థీభావంబు సామర్థ్యంబు. పృథక్ప్రసిద్ధార్థంబులగు పదంబుల కేకార్థంబునందు వృత్తిసామర్థ్యము.

2. సాంస్కృతి కాచ్ఛిక మిశ్రభేదంబుచే సమాసంబు త్రివిధంబు.

సాంస్కృతికంబని యాచ్ఛికంబని మిశ్రంబని సమాసంబు త్రివిధంబు. అందు సాంస్కృతికంబు సిద్ధం బని సాధ్యంబని ద్వివిధంబు. కేవల సంస్కృతశబ్దంబుల సమాసంబు సిద్ధంబు నాఁబడు - రాజాజ్ఞ - తటాకోదకము - లక్ష్మీవల్లభుఁడు. సంస్కృత సమంబుల సమాసంబు సాధ్యంబు నాఁబడు. రాజునాజ్ఞ - తటాకంబు నుదకము - లక్ష్మీవల్లభుఁడు. తక్కిన తెనుఁగుల సమాసం బాచ్ఛికం బనంబడు. ఱేనియానతి - చెఱువునీరు - సిరిచెలువుఁడు. ఉభయంబు గూడినది మిశ్రమంబనంబడు. రాజుముదల - చెరువునుదకము - సిరివల్లభుఁడు.

3. తత్పురుషాదులకు లక్షణంబు ప్రాయికంబుగ సంస్కృతోక్తంబ యగు.

తత్పురుష బాహువ్రీహి ద్వంద్వంబునని సమాసంబులెల్లం ద్రివిధంబులయి యుండు. అవి ప్రాయికంబుగా నుత్తరాన్యోభయపదార్థ ప్రధానంబు లయియుండు. అందుఁ దత్పురుషంబు