పుట:Balavyakaranamu018417mbp.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. ఋ ౠ ఌ ౡ విసర్గ ఖ ఛ ఠ థ ఫ ఝ ఢ ధ భ ఙ ఞ శ లు సంస్కృత సమంబులను గూడి తెలుఁగున వ్యవహరింపబడు.

ఋతువు - పితౄణము - దుఃఖము - ఖడ్గము - ఘటము - ఛత్రము - ఝరము - కంఠము - ఢక్క - రథము - ధరణి - ఫణము - భయము - ఆజ్ఞ - శరము - షండము.

5. క చ ట త ప లు పరుషంబులని గ జ డ ద బ లు సరళంబులని చెప్పంబడు.

6. ఇతరములగు హల్లులు స్థిరములు.

ఖ ఘ ఛ ఝ జ్ఞ ఠ ఢ ణ థ ధ న ఫ భ మ య ర ల వ శ ష స హ ళ.

7. దంత్యతాలవ్యంబులయిన చ జ లు సవర్ణంబులు.

తాలవ్య చకారంబు దంత్య చకారంబునకును దాలవ్య జకారంబు దంత్య జకారంబునకును గ్రాహకములని తాత్పర్యము.

8. ఇ ఈ ఎ ఏ లం గూడిన చ జ లు తాలవ్యంబులు.

చిలుక - చీమ - చెలి - చేమ; జిల - జీడి - జెఱ్ఱి - జేజ.

9. అ ఆ ఉ ఊ ఒ ఓ ఔ లం గూడిన చ జ లు దంత్యంబులు.