పుట:Balavyakaranamu018417mbp.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కడ, ఎదురు, కొన, చివర, తుద, తెన్ను, తెరువు, నడుమ, పగలు, పిడుగు, బయలు, మొదలు ఇత్యాదులు కడాదులు.

41. ఆమ్రేడితంబు పరంబగునపుడు విభక్తిలోపంబు బహుళంబుగా నగు.

అప్పటికిన్‌. ... అప్పటికిన్‌ ... అప్పటప్పటికిన్‌, అప్పటికప్పటికిన్‌

అక్కడన్‌ ... అక్కడన్‌ ... అక్కడక్కడన్‌, అక్కడనక్కడన్‌

ఇంటన్‌ ... ఇంటన్‌ ... ఇంటింటన్‌, ఇంటనింటన్‌

ఊరన్‌ ... ఊరన్‌ ... ఊరూరన్‌, ఊరనూరన్‌

ఇంచుక నాఁ డిత్యాదులందు బహుళగ్రహణముచేత నంతిమాక్షర లోపంబు నగు.

ఇంచుక ... ఇంచుక ... ఇంచించుక. ఇంచుకించుక

నాఁడు ... నాఁడు ... నానాఁడు, నాఁడునాఁడు

42. అందదుకు ప్రభృతులు యథా ప్రయోగంబుగ గ్రాహ్యంబులు.

అందదుకు, ఇఱ్ఱింకులు, ఇల్లిగ్గులు, చెల్లచెదరు, చెల్లాచెదరు,