పుట:Balavyakaranamu018417mbp.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకానొక శబ్దంబున నొకానొక శబ్దము పరంబగునపుడు తొంటియటు లోపనుగాగమంబును, గొండొక శబ్దమున కొకానొక శబ్దము పరంబగునపుడు లోపద్విత్వంబులును ప్రయోగంబులందుఁ జూపట్టెడునని తాత్పర్యము.

పది ... తొమ్మిది ... పందొమ్మిది

తొమ్మిది ... పది ... తొంబది

వంక ... చెఱఁగు ... వంజెఱఁగు

సగము ... కోరు ... సంగోరు

నిండు ... వెఱ ... నివ్వెఱ

నిండు ... వెఱఁగు ... నివ్వెఱఁగు

నెఱ ... తఱి ... నెత్తఱి

నెఱ ... నడుము ... నెన్నడుము

నెఱ ... మది ... నెమ్మది

నెఱ ... వడి ... నెవ్వడి

ఇత్యాదులు ప్రయోగంబుల వలనం దెలియునది.

40. ఆమ్రేడితంబు పరంబగునపుడు కడాదులం దొలి యచ్చు మీఁది వర్ణంబుకెల్ల నదంతం బగు ద్విరుక్త టకారం బగు. ఈ సూత్రమునకు భృశార్థంబునందు ద్విరుక్తంబు విషయంబని యెఱుంగునది.

కడ ... కడ ... కట్టకడ

ఎదురు ... ఎదురు ... ఎట్టఎదురు