పుట:Balavyakaranamu018417mbp.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38. క్రొత్తశబ్దమున కాద్యక్షరశేషంబునకుం గొన్ని యెడల నుగాగమంబునుం గొన్ని యెడల మీఁదిహల్లునకు ద్విత్వంబు నగు.

క్రొత్త ... చాయ ... క్రొంజాయ

క్రొత్త ... చెమట ... క్రొంజెమట

క్రొత్త ... పసిఁడి ... క్రొంబసిఁడి

క్రొత్త ... కారు ... క్రొక్కారు

క్రొత్త ... తావి ... క్రొత్తావి

పరుషేతరంబులు పరంబులగునపుడు నుగాగము ప్రాప్తి లేమిఁ జేసి వానికి ద్విత్వంబగు.

క్రొత్త ... గండి ... క్రొగ్గండి

క్రొత్త ... నన ... క్రొన్నన

క్రొత్త ... మావి ... క్రొమ్మావి

కెంధూళి కెంజడలని ప్రయోగంబులు కానంబడియెడి. బహుళ గ్రహణముచేతఁ గ్రొత్తకుండ లిత్యాదుల లోపంబులేదు. క్రీఁగడుపు, క్రీఁగాలు, క్రీఁదొడ ఇత్యాదులం గ్రిందుశబ్దమునకు లుప్తశేషంబునకు దీర్ఘంబు బహుళ గ్రహణముచేత నని యెఱుఁగునది.

39. అన్యంబులకు సహిత మిక్కార్యంబులు కొండొకచోఁ గానంబడియెడి.