పుట:Balavyakaranamu018417mbp.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5. పయ్యెద పయ్యద.

6. ఊ యే లాదులం దొలియచ్చుమీఁది హల్లునకు ద్విర్వచనం బొండె నగు.

ఉయ్యేల - ఊయేల, ఊయేల - ఊయెల, ఊయాల - ఊయల, ఆయె - ఏవిధము - ఓయ - ఓయారము - కోపు (ధనురగ్రము) - జాగర - తీనియ - తీయము - తేప(ప్లవము) - తేమ - తోయలి - దీవియ - నూవు - నోవి - నోవు - పూవు - పేయ - మోక(అంకురము) మోటిక - మోపు - వీయము ఇత్యాదు లూయేలాదులు.

7. ఱ కారంబు క్రింది ఱ కారంబునకుం దుది ను లు ల క్రింది న ల లకు లోపంబు బహుళంబుగ నగు.

అఱ్ఱు - అఱు, గొఱ్ఱియ - గొఱియ, కన్ను - కను, నన్ను - నను, పల్లు - పలు, విల్లు - విలు.

8. అక్కటాదుల ౙడ్డకు లోపంబు విభాష నగు.

అకట - అక్కట. అక్కట - అట్టిక - అట్టుక - అట్టె - అయ్యో - అయ్యారె - అవ్వారి - ఇట్టిక - ఉప్పవడము - ఉమ్మి - ఎక్కసక్కియము - ఎక్కసెక్కియము - ఎక్కిరింత - ఎడ్డ - ఎన్నిక - ఎమ్ముక - కజ్జాయము - కట్టా - కట్టిక - కప్పురము - కమ్మటము - కమ్మతము - కువ్వాడము - కొట్టిక - కొమ్ము - కొయ్యగూర - గయ్యాళము - గిజ్జిగాఁడు - గుజ్జరాతి - చిట్టి - చిన్న - చిమ్మట - చెన్నఁటి - చెప్పుము - చెప్పుఁడు - చెమ్మట - చెల్లి