పుట:Andhrulacharitramu-part3.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనపోత మాధవభూపాలుర రాజ్యపాలనము

రేచర్లవంశమువారిలో స్వశక్తిచే మహారాజపదవి నొంది స్వతంత్రులై రాజ్యపరిపాలనము చేసినవారిలో నీ యనపోత భూపాలుడే ప్రప్రథముడుగా గన్పట్టుచున్నాడు. ఇతని పూర్వులెవ్వరు నీరీతిగా స్వతంత్రులై రాజ్యపరిపాలనము చేసినట్లు తెలుపు దృష్టాంత మింతవఱకు జరిత్రమున గానరాదు. వీరి పూర్వు లెల్లరును కాకతీయచక్రవర్తులకు భృత్యులుగ నుండి సేనాపతులై కాకతీయసామ్రాజ్యసంరక్షకులై యొప్పియుండిరి గాని యాతనివిధముగా మహారాజులై స్వతంత్రముగా భూపరిపాలనము చేసినట్లు గన్పట్టదు. ఈయనపోతనాయడును మాధవనాయడును క్రౌర్యమును బూని రెడ్లు మొదలగువారితో ద్వేషమును బెంచుకొని పోరాడక వారలతో జెలిమి చేసికొని తురుష్కుల నెదిరించి యుండినయెడల నిజముగా బహమనీరాజ్యము దక్షిణహిందూస్థానమునందు వర్ధిల్లక నశించియుండును. ఇప్పటి నిజామురాజ్యములోని తెలుగుజిల్లా లన్నియు నాకాలమున వారిరాజ్యమునం దిమిడియున్నవని చెప్పవచ్చును. వీ రసహాయశూరులై యొకవంక మహమ్మదీయులతోడను మఱియొకప్రక్క రాచవారితోడను, వేఱొకప్రక్క రెడ్లతోడను నిరంతరము బోరాడు చుండిన వారగుటచేత వీరిరాజ్యము తఱచు యుద్ధరంగమగుచు వీరులకుమాత్రమె జన్మ