పుట:Andhrulacharitramu-part3.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భూమిగ నుండుచు వచ్చెను. "శ్రీశైలవిన్ధ్య మధ్యోర్వీమణ్డలమ్ పరిపాలయన్" అనిఉమామహేశ్వరశాసనములోని యొకశ్లోకములోను "విన్ధ్యశ్రీశైలమధ్యక్ష్మామండలం పాలయస్సుతై:" అను సింగభూపాలీయములోని యొకశ్లోకములోను వీరు విన్ధ్య శ్రీశైలమధ్యోర్వీమండలము పరిపాలనము చేసినట్లు చెప్పబడినను గోదావరీనదికి బైనుండుదేశ మీయనపోతనాయని రాజ్యములో జేరియుండె ననుటకు వేఱొక ప్రమాణము గానరానందున నది కవికల్పిత మైనయతిశయోక్తి యని భావింప వచ్చును. శత్రురాజులతో జరుపుయుద్ధములందును రాజ్యపరిపాలనాభారమును నిర్వహించుటయందును తమ్ముడు మాధవభూపాలు డన్నయగు అనపోతభూపాలునకు దోడునీడయయి యుండెను. ఆంధ్రదేశాధీశ్వరుం డనుబిరుదము అనపోతనాయని కున్నట్లుగా నాతనిచే స్థాపింపబడిన శాసనములలో బేర్కొనబడియుండుటచేతను అట్టిబిరుదము మాధవనాయని శాసనమునం గనుపట్ట కుండుటచేతను, అనపోతభూపాల్లుం డాయాంధ్రదేశభాగమును బరిపాలించు చుండ వానియనుమతిని తమ్ముడు యువరాజుగ నుండి పరిపాలనము చేయుచున్నట్లు మనమూహింపవలసియుండును గాని శ్రీశైలోత్తరద్వారమైనయుమామహేశ్వరములో దేవస్థానసమీపమున నున్న మాదానాయనిశాశనములో "శ్రీ మాధవేంద్రుండు దేవనగదక్షిణప్రాంతమందుల స్వనామాం