పుట:Andhrulacharitramu-part3.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టమునకుఁ బాఱి వచ్చి భయార్త యగుచు రక్షణార్థము నూత్నవరాన్వేణచిత్తయై త్రిలింగకర్ణాటకభూములలో నటు నిటుఁ బఱువు లిడుచు చిందులుద్రొక్కనారంభించెను. ఆహా! సామ్రాజ్యలక్ష్మి చంచలయు, వీరవేశ్యయనుమాట జగద్వితిమయ్యెను గదా! ఇట్లాంధ్రసామ్రాజ్యము భగ్నము కాఁగా మున్ను యాదవకులములో ముసలము జనించినప్పుడు యదువృష్ట్ని, భోజాంధక వీరవర్గమెట్లుకలంగెనో, కర్ణాటాంధ్ర భూములలో విగ్రహారాధనద్వేషమతాభిరతు లగు నూత్న జాతిముసల్మానువీరులు ప్రవేశించినప్పుడట్లే త్రిలింగకర్ణాటక వీరప్రపంచంబు కలంగి సంక్షుభిత మయ్యెను.

బలాఢ్యులైన శాత్రవులు దండెత్తివచ్చి తమదుర్గము లాక్రమించుకొని ప్రతాపాగ్ని ప్రజ్వలింపఁజేయుచున్నపుడు రాచనాగు, కమ్మవారు, రెడ్డినాయకులు, బలిజనాయకులు, పద్మనాయకులు, ఏకమై వైరి వీరులను తఱిమి ప్రతాపరుద్రునికిఁ బట్టము గట్టి యాంధ్రసామ్రాజ్యము నుద్ధరించటకు మాఱుగా స్వార్థపరులై ఒక్క దేశీయుల మనుమాట మఱచి యదువృష్ట్ని, భోజాంధకులవలెనెయొండురుల గొంతుకలు గోసుకొనుచు నాంధ్రభూతలము రక్తపూరితము గావించుచుండిరి. ప్రతాపరుద్రుని పుత్త్రుఁడు దిక్కులేనిపక్షి యయి తిరుగవలసి వచ్చెను. ఆంధ్రనగరము తత్ప్రాంతదేశము తురుష్కులవశ