పుట:Andhrulacharitramu-part3.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మయ్యెను. ఆంధ్రభూతలమున తురుష్కప్రతాపాగ్ని దహించుచుండెను. డిల్లీ చక్రవర్తి యయిన గ్యాసుద్దీన్ తుఘ్‌లఖ్ యొక్క పెద్దకొడుకును తురుష్కసైన్యాధ్యక్షుఁడును నైన మల్లిక్ ఫకీరుద్దీన్ జూనా' అను నామాంతరము గల అలూఫ్ ఖాను ఏకశిలానగరమునకు ఇమ్మద్ ఉల్‌ముల్క్ కును బాలకుని (గవర్నరు) గా నియమించి కొంత సైన్యమచట నిలిపి కొదువ సైన్యముతో దండయాత్ర బయలుదేఱి ప్రాగాంధ్రదేశము మీదుగాఁగళింగ దేశమునుకును అటునుండి డిల్లా నగరమునకును బోవ నిశ్చయించుకొని రాజమహేంద్రపురమునకుఁ బ్రయాణము సాగించెను.

రాజమహేంద్రపురము తురుష్కులవశ మగుట

ఇట్లు తురుష్కులు తమ్మెదుర్కొనువారు లేక ముష్కరులై ఏకశిలానగరమునకును రాజమహేంద్రపురమునరు నడువను గల యావద్ధేశమును కొల్లపెట్టుచు, అనేక ఘోరకృత్యములను గావించుచు వచ్చి రాజమహేంద్రపురదుర్గమును ముట్టడించెను. ఇట్లు విజృంభించి నిరాటంకముగా దేశమధ్యమునుండి దండయాత్ర వెడలి వచ్చిన శత్రుసైన్యమును పరాక్రమ విజృంభితులగు తెలుఁగునాయకులు గొందఱు స్వల్పసైన్యముతో నెదుర్కొని కొన్నిదినములు పోరాడఁ గలిగిరి. కాని