పుట:Andhraveerulupar025958mbp.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రనియు సంగరమున కాయితమగుట యుక్తమనియు బ్రహ్మనాయకునితో విన్నవించెను. బాలచంద్రుడు గూడ సంగరము చేయుటయందు దనకుగల యుత్సాహము సూచించెను. బ్రహ్మనాయకుడు కొమ్మరాజు పుత్రుడును ప్రతిపక్షరాజగు నరసింగరాజున కల్లుడునగు అలరాజును సంధివిషయమై ప్రసంగించుటకు గురిజాలకు వృద్ధబంధుజనానుమతంబున బంపెను. సంధిప్రయత్నము వ్యతిరేకమైనచో సంగరమునకేని సిద్ధముగా నుండవలయునని బ్రహ్మనాయడు బంధువులకు ఆప్తులకు ముందుగ దెలిపి యుద్ధపరికరములను జాగ్రత్త పఱచు చుండెను.

బ్రహ్మనాయని పక్షమువారికిని నాయకురాలిపక్షమువారికిని సంధికుదురకపోయెను. సవతితల్లికుమారులగు బాలమలి దేవాదులకు రాజ్యములో భాగమునీయమని నలగామరాజు ఖండితముగా దెలిపెను. రాయబారమునకు నేగిన అలరాజును నిర్దయగా వధించిరి. ఏడుసంవత్సరములు అజ్ఞాతవాసముజేసి వచ్చిరని గూడ సవతితల్లి కుమారులపై నలగామరాజునకు నరసింగరాజునకు నాయకురాలికి గరుణరాదయ్యెను. సంగరమునకు గారముపూడిచెంత నాగులేటితీరమున గల విశాలప్రదేశమును నెలవుచేసికొని యుభయపక్షములవారు చాల భయంకరముగా బోరాడిరి. కన్నమనాయడు డీసమయమున సంగరవిధమును బ్రహ్మనాయని కెఱుగ జేయుచు నుండెను. శత్రు