పుట:Andhraveerulupar025958mbp.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రింపగా గురిజాల కేగినటుల దెలియవచ్చెను. మధ్యాహ్నమైనను కన్నమనాయడు గురిజాలనుండిగూడ రాకపోవుటకు జాలచింతించి బ్రహ్మనాయడు స్వయముగా గురుజాలకు బయనమయ్యెను. కన్నమనాయడు తప్పక సురక్షితముగా రాగలడు. మీరు గురుజాలకు బోవలదని నాయనితో భటులు, ఆప్తులుచెప్పిరిగాని ఆతడు వినక బయలుదేరెను. కన్నమనాయడు గావించిన పరాభవము తలంచికొని నాయకురాలు ప్రతిక్రియకొఱకు వెదకుసరికి బ్రహ్మనాయకుడు గురిజాల చేరి తనకుమారుడు సురక్షితముగా జోరులను వంచించిన విషయము విని చాలసంతసించెను. నాయకురాలు గురిజాల నడివీధిలో కోడి పందెములు, పొట్టేళ్ళ పందెములు, పికిలిపిట్టల పందెములు. కౌజు పందెములు, పెట్టి యెటులో బ్రహ్మనాయకు నొప్పించి యందు దానెగెలిచెను. ఓడినవారు ఏడుసంవత్సరములు అరణ్యభూములలో నివసించి పిదప రాజ్యము బొందునటుల గట్టడి చేసికొనుటచే బ్రహ్మనాయకుడు పరివారముతో నడవులపాలై నియతకాల మెంతో శ్రమమీద జరిపి తన రాజ్యము తనకు వశముచేయుమని రాజకుమారుల పక్షమున నలగామ రాజాదులకు వర్తమాన మంపెను. కన్నమనాయడు రాయబారములతో గార్యమెన్నటికేని యనుకూలింపదనియు ఏడు సంవత్సరములనుండి రాజ్యమును జూరగొన్న విరోధులు మాటలతో దిరుగ రాజ్యము నొసంగ