పుట:Andhraveerulupar025958mbp.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిగుల బేరు ప్రతిష్ఠల గాంచెను. సోమరా జీతనికుమారుదు. ఇతడు పరాక్రమమున నాంధ్ర రాజ్యాధినేతలకు సర్వ విధంబుల సాటివాడై ప్రత్యర్థుల ననేకుల జయించి రాజ్యము మిగుల నభివృద్ధిలోనికి దెచ్చి కందారములో శత్రుజనాభేద్యముగ నొక గొప్ప కోటను గట్టించి తండ్రికాలము కంటె దన కాలమున నైశ్వర్యము నభివృధిలోనికి గొనివచ్చి పరాక్రమైక జీవనుడై ధర్మపరిపాలనము గావించు చుండెను. ఆంధ్రదేశమునకు జెందిన కొంతభూభాగము నీతడు నిరంకుశముగ పరిపాలించుచుండ దోడివారలకు గన్నెఱ్ఱ జనింపసాగెను. వీరవర్యుడగు సోమరాజు దైవమును దక్క తదన్నుని లెక్కసేయక పగవాడను వాడు లేకుండ బరిపాలించుచుండెను.

సోమరాజునకు సామంతులుగ నున్న రాజులు కొందరు అసూయపరులై స్వతంత్రముగ వర్తింప నిచ్చగించి యాకాలమున బలవంతుడుగ నున్న కటకపరిపాలకు నాశ్రయించి సోమరాజుపై గత్తిగట్టిరి. దురాశాపీడితుడగు కటక పరిపాలకుడు క్రమక్రమముగా మాటలతీయదనంబుచే సోమభూపాలుని సామంతుల నందఱ లోగొని యంతఃకలహముల నభివృధి జేయచుండెను. సోమరాజు కొంతకాలమునకు గటకేశ్వరుని దురంతమును గ్రహించి సామంతుల నందర సామదానోపాయములచే లోగొని కటకేశ్వరుని వంచనోపాయములతో వంచించి యాతని విషయమున గనుగలిగి మెలగు