పుట:Andhraveerulupar025958mbp.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చుండెను. తనప్రయత్నము వ్యర్థమగుటచే నెటులేని సోమరాజునువంచించి వానిరాజ్యము లోగొనవలయునని నిశ్చయించుకొని కందారరాజ్యము నెటుల ముట్టడింప వీలగునాయని చిరకాలమునుండి కటకేశ్వరుడు తీవ్రప్రయత్నములు చేయు చుండెను. సోమరాజు చారులవలనను ఇంగితవేదులగు పరిజనులవలనను గటకరాజు తలంపు సమగ్రముగ నెఱింగి బలంబుల నభివృద్ధిగావించికొని శత్రుజనభీకరముగ వర్తించుచుండెను. ఉభయులహృదయములలో నంత:కలహము పెచ్చరిల్లి దినదినాభివృద్ధి గాంచుచుండెను. సోమరాజు కటకేశ్వరుని దురంతములు వినివిని చేయునదిలేక సమానుడగునాతని నెటులేని వంచింపవలయునని తీవ్రముగ బ్రయత్నము చేయుచుండెను. సామంతుల యభిప్రాయములు సరళముగ నుండకుంటచే నెటుపోయిన నెటువచ్చునో యని సోమరాజు తనకై తాను సంగ్రామమున కేగు ప్రయత్నమును మానుకొని ప్రత్యర్ధియే యెత్తివచ్చిన యాత్మసంరక్షణము గావించుకొనదగినంత బలమును వహించి వర్తింపసాగెను.

సోమరాజు గోవులయందు మిగుల భక్తివిశ్వాసము గలవాడగుటచే సామంతుల వలనగూడ గప్పము క్రింద గోవుల జేకొని విశాలమగు తన కాననంబుననుంచి మిగుల గూరిమితో దిలకించుచు సంరక్షణమునకై పెక్కండ్రు పరిపాలకుల నియోగించి ప్రేమింపసాగెను. ఆకాలమున రా