పుట:Andhraveerulupar025958mbp.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మునం దుదాహరింప బడిన పదిమందివీరులలో నీమువ్వురి రాజ్యములుమాత్రము నేటి కాంధ్రజాతీయతకు దృష్టాంతముగ నిలిచియున్నవి. మిగిలిన యేడ్వురచరిత్రము కేవలచరిత్ర శరణ్యముగా నున్నది.

కొలదికాలములో మూడవ భాగముగూడ బ్రచురింపనున్నారము. అందు బెద్దాపురము, వనపర్తి, ఆత్మకూరు, బొబ్బిలి మున్నగు రాజ్యములను బాలించిన పూర్వరాజుల చరిత్రములు వ్రాయదలంచితిమి. ఆంధ్రవీరులకు సవిమర్శమగు తొలిపలుకు వ్రాసి గ్రంథప్రశస్తికి గారకులైన బందరు హిందూహైస్కూలు ప్రథానోపాధ్యాయులగు బ్రహ్మశ్రీ వారణాసి శ్రీనివాసరావు పంతులు ఎం.ఏ.,ఎల్.టి. గారియెడ గృతజ్ఞులము.

ఈగ్రంథములు వ్రాయుటలో మమ్మ మిగులబ్రోత్సహించుటయెగాక ముద్రించి యచిరకాలమున వ్యాప్తికి దెచ్చిన వేంకటరాం అండ్ కో, బెజవాడవారు కృతజ్ఞతా పాత్రులు.

ఇట్లు భాషాసేవకులు,
శేసాద్రి రమణకవులు
శతావధానులు.
నందిగామ,
1 - 8 - 1927.
________