పుట:Andhraveerulupar025958mbp.pdf/7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

లొందిన యభ్యున్నతికి దార్కాణముగా నిందు బలనాటి వీరులలో బేరొందిన కన్నమనాయని చరిత్రమును సేకరించి యీ గ్రంథమునందు జేర్చితిమి.

ఆంధ్రుల పూర్వచరిత్ర మగాధముగా నున్నది. ఉన్నంతలో నసమగ్రభాగములు మెండు. కథారూపముగా నభిరుచితో బఠింప వీలగు నాదర్శ పురుషుల జీవితసారముల నీ గ్రంథమున జతపరచితిమి. ప్రథమభాగమువలె నీ ద్వితీయ భాగముగూడ బ్రజాదరణపాత్ర మయ్యెనేని మేము ధన్యులము. ద్వితీయ ముద్రణము నాటి కిందలి దొసంగులున్న సవరించుకొని నిర్దుష్టము గావించు కొందుము. ప్రకృతము దేశసేవగావించు విజయనగరము, గద్వాల, వెంకటగిరి, బొబ్బిలి, పిఠాపురము, మున్నగు సంస్థానములకు స్థాపకులగు రాజుల చరిత్రముగూడ నిందు సేకరించితిమి. విజయరామరాజు స్వతంత్రాభిరతులగు విజయనగర రాజులలో గడమవాడు. ఈయన కార్యదీక్ష, స్వాతంత్ర్యతృష్ణ నిరుపమానములు, అనపోతనాయకుడు వేంకటగిరి, పిఠాపురము, జటప్రోలు, మైలవరము, బొబ్బిలి సంస్థానముల మూలపురుషుడు. ఈమహావీరుని జీవిత ముద్రేకకరముగ నుత్సాహకరముగా నుండును. గద్వాల సామ్రాజ్య నిర్మాతయగు సోమనాద్రి యవనరాజులకు బ్రబలప్రత్యర్థి; స్వాతంత్ర్యము కాపాడుకొని దేశీయకళల బోషించిన వీరచూడామణి. ఈ గ్రంథ