పుట:Andhraveerulupar025958mbp.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ననతికాలమున నాయితము గావించి బలములను సమకూర్చి, కందారరాజ్యము ప్తెకి జతురంగ బలములతో దాడివెడలెను. దురదృష్టవశమున నీ వర్థమానము సోమరాజు గ్రుహింపజాలడయ్యెను.అతని బలములన్నియు ననాయత్తముల్తె యుండెను. సంగ్రామమునకు గటకరా జింతస్వల్ఫకాలములో నెత్తి వచ్చుని యతడెఱుంగడు.

ఆకస్మికముగ నేలయీనినట్లున్న కటకేశ్వరుని సైన్యము కందారమును ముట్ట్టడించి విజయదుందుభి మ్రోగించెను.రాజును మంత్రులు తహతహపడి చేయునదిలేక పౌరులలో గొందఱును నగరసంరక్షణమునకు నియోగించి సిద్డముగ దైవవశమున హస్తగతముగ నున్న కొలది సైన్యమునుగొని సంగరమునకు బయనమైరి

కటకేశ్వరుని బల మమితముగా నుంటవలనను సోమరాజు సంగ్ర్రామము జరుగునని తలంచి యుండక పోవుటవలనను జయాపజయములు క్షణములో బహిర్గత మయ్యెను. కటకేశ్వరుని సైనికులు విచ్చలవిడిగా విజృంభించి ఋరుజుల కెగ బ్రాకి ద్వారముల భేదించి పగతుర వధించి యనేక సాహస కార్యాములు గావింప సాగిరి. సోమభూపాలునకు జయముపై నాస తొలంగెను. చేయునది లేక యంతఃపురమున కేగి తన దర్మపత్నియగు సిరియాల దేవిని సందర్శించి జరుగుచున్న సంగ్రామమును గూర్చిన చరిత్రము నంతయు